నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్  కరోనాతో హైద్రాబాద్‌ ఆసుపత్రిలో ఆదివారం నాడు చేరారు. తాజాగా గణేష్ గుప్తాకు కూడ కరోనా సోకడంతో కరోనా సోకిన ఎమ్మెల్యేల సంఖ్య తెలంగాణలో మూడుకి చేరుకొంది.

also read:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

ఎమ్మెల్యే హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా తేలడంతో నిజామాబాద్ నుండి వాహనాన్ని నడుపుకొంటూ ఆయన హైద్రాబాద్ కు వచ్చారు. 

తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఈ ముగ్గురు  కూడ టీఆర్ఎస్‌కి చెందినవారే.రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకడంతో ప్రజా ప్రతినిధుల్లో టెన్షన్ నెలకొంది.

ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో ఇప్పటివరకు సన్నిహితంగా ఎవరెవరు మెలిగారనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరందరికి కూడ జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ నెల 13వ తేదీన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేతో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా భేటీ అయ్యారని సమాచారం. దీంతో ఆయనకు కరోనా సోకినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు.