Asianet News TeluguAsianet News Telugu

అజెండా కోసం ఎన్నో భేటీలు..కేసీఆర్ మాటలు అవాస్తవం, తెలంగాణకు కేటాయింపులివే : నీతి ఆయోగ్

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ స్పందించింది. అజెండా తయారీలో రాష్ట్రాలకు సహకరించడం లేదన్న కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. గడిచిన ఏడాదిలోనే సీఎంలతో 30 సమావేశాలు నిర్వహించామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా తెలంగాణ సీఎం స్పందించలేదని వ్యాఖ్యానించింది. 

niti aayog condemns telangana cm kcr comments
Author
New Delhi, First Published Aug 6, 2022, 7:29 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై నీతి ఆయోగ్ స్పందించింది. అజెండా తయారీలో రాష్ట్రాలకు సహకరించడం లేదన్న కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. రేపటి సమావేశానికి సన్నాహకంగా తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలతో వివరణాత్మక సంప్రదింపులు జరిగాయని చెప్పింది. తెలంగాణ సీఎస్ సహా అన్ని రాష్ట్రాల సీఎస్‌లు పాల్గొన్నారని నీతి ఆయోగ్ తెలిపింది. రేపటి సమావేశానికి హాజరుకావొద్దన్న కేసీఆర్ నిర్ణయం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. కేంద్రం రాష్ట్రాలకు ఆర్ధికంగా అన్ని రకాలుగా సహకరిస్తోందని తెలిపింది. 

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కేటాయింపులు.. 2015-16లో రూ.2 లక్షల 3 వేల 740 కోట్లని నీతి ఆయోగ్ వెల్లడించింది. 2022- 23 ఏడాదికి రూ. 4 లక్షల 42 వేల 781 కోట్లకు చేరిందని తెలిపింది. జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు 3,982 కోట్లు కేటాయించామని... కానీ తెలంగాణ కేవంల రూ.200 కోట్లు మాత్రమే ఉపసంహరించుకుందని నీతి ఆయోగ్ చురకలు వేసింది. పీఎంకేఎస్‌వై- ఏబీపీ స్కీం కింద రూ.1,195 కోట్లు విడుదల చేశామని తెలిపింది. సమాఖ్య స్పూర్తి బలోపేతం కోసమే ఈ సంస్థను ఏర్పాటు చేశామని.. గడిచిన ఏడాదిలోనే సీఎంలతో 30 సమావేశాలు నిర్వహించామని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. పలుమార్లు సమావేశం కోసం ప్రతిపాదించినా తెలంగాణ సీఎం స్పందించలేదని వ్యాఖ్యానించింది. 

ALso REad:రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేసీఆర్ కీలక ప్రకటన

అంతకుముందు శనివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. రేపు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం వైఖరిపై నిరసన తెలియజేయడానికి దీనిని ఉత్తమైన మార్గంగా భావిస్తున్నట్టుగా కేసీఆర్ చెప్పారు. బహిరంగ లేఖ ద్వారా ప్రధాని మోదీకి తనన నిరసనను నేరుగా తెలియజేయనున్నట్టుగా తెలిపారు.  

బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చిందన్నారు. నీతి ఆయోగ్‌తో దేశానికి మంచి రోజులు వస్తాయని ఆశించామని చెప్పారు. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ నిరర్దక సంస్థగా మారిందని విమర్శించారు. బీజేపీ 8 ఏళ్ల పాలనలో ఏం అభివృద్ది జరిగిందని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రైతులు 13 నెలల పాటు పోరాటం చేశారని గుర్తుచేశారు. రైతులు పోరాటం చేయకముందే.. 13 రోజుల్లో చట్టాలను రద్దు చేసి ఉండొచ్చు కదా అని  కామెంట్ చేశారు. దేశంలో ద్వేషం, అసహనం పెంచుకుంటూ పోతున్నారని మండిపడ్డారు. రైతులకు ప్రధాని క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios