తెలంగాణలో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. ప్రియాంక రెడ్డి అనే వెటర్నరీ డాక్టర్ ని అతి కిరాతకంగా హత్య చేశారు. ముందుగానే ప్లాన్ వేసి.. పథకం ప్రకారం ఆమె స్కూటీ పంచర్ చేశారు. దానిని బాగు చేస్తామంటూ మాయమాటలు చెప్పి... పొదల్లోకి తీసుకువెళ్లి అతి కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రాన్ని వణికించింది.

AlsoRead చంపేశాక కూడా వదల్లేదు... ప్రియాంక రెడ్డి హత్య కేసులో విస్తుపోయే నిజాలు...

ఇలాంటి సంఘటనే 2012లో దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నిర్భయ అనే యువతిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేశారు.  ఆ సమయంలో నిర్భయ రెండు రోజులపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నరకం అనుభవించి మరీ చనిపోయింది. ఆ ఘటన తర్వాతే నిర్భయ చట్టానికి అమల్లోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ.. ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  

తమ కుమార్తెకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని నిర్భయ తల్లిదండ్రులు చాలాకాలం పోరాటం చేశారు. కాలం గుడుస్తుండగా అందరూ ఆ ఘటనను మర్చిపోయారు. కాగా... ప్రియాంక రెడ్డి హత్యోదంతం తెలిసిన తర్వాత నిర్భయ తల్లి ఆశాదేవి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. 

Also Read:ప్రియాంక రెడ్డి కేసు: స్కూటీ పార్క్ చేయడం చూసి...కాటు వేయడానికి పక్కాగా ప్లాన్

ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆమె,మన వ్యవస్థలో లోపాల వల్లే ఈ తరహా ఘటనలు పదే పదే ఉత్పన్నమవుతున్నాయి ఆవేదన చెందారు. నేరస్తులు ఏ సమయంలోనైనా భయం లేకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు.

 రాత్రి 11 అయినా, రెండు గంటలైనా మగవాళ్ళు తిరిగినంతగా,మహిళలు బయటకు రాలేని పరిస్థితి అని ఆమె అన్నారు. అంతేకాదు ఏదైనా నేరం చేస్తే రెండు మూడేళ్లు జైలు కి వస్తే సరిపోతుంది అన్న భావన నేరస్తులను భయం లేకుండా చేస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read:ఇంకెంతమంది ప్రియాంకలు బలవ్వాలి: ఆడపిల్లను కాపాడుకోలేమా, తల్లిదండ్రుల కన్నీటి ఆవేదన

న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని నేరస్థులు చెలరేగి పోతున్నారని, ఇది మన దౌర్భాగ్యం అని ఆశా దేవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. నిర్భయ కేసులో నేటికీ తాను పోరాడుతున్నానని, ఏడు సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆమె ఆవేదన చెందారు. 

కోర్టులు, చట్టాలు నేరస్తులకు చుట్టాలుగా మారుతున్న క్రమంలో న్యాయం ఎక్కడ జరుగుతుంది అని, నేరస్తులు ఎందుకు భయపడతారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన దేశం ప్రధానంగా పురుష ప్రధాన దేశమని, ఇన్ని సంవత్సరాల పోరాటం లో తనకు అర్థమైందని నిర్భయ తల్లి ఆశా దేవి పేర్కొన్నారు.