Asianet News TeluguAsianet News Telugu

Night Curfew in Telangana: తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ! ఎప్ప‌టి నుండంటే?

Night Curfew in Telangana: మేడారం తరువాత కరోనా కేసులు పెరిగితే తెలంగాణ సర్కార్ తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు వైద్య‌నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
 

night curfew in telangana after medaram jatara
Author
Hyderabad, First Published Jan 27, 2022, 3:56 PM IST

Night Curfew in Telangana: గ‌త రెండేండ్లుగా యావత్తు ప్రపంచాన్ని కరోనా మ‌హామ్మారి పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి కొత్త కొత్త‌ రూపంలో మాన‌వాళిపై దాడి చేస్తోంది. ఈ వైర‌స్ ను కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమిస్తున్నారు. నిత్య ఈ వైర‌స్ ప‌రిశోధ‌నలు చేస్తూ.. కట్టడికి కృషి చేస్తున్నారు.  కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కోవిడ్ టీకా పంపిణీ మొదలైన.. అప్పటికే కరోనా డెల్టా వేరియంట్ రూపంలో మరోసారి సెకండ్ వేవ్ సృష్టించింది. దీంతో ప్రపంచ దేశాలు సైతం కోవిడ్ టీకా పంపిణీని యుద్ధ ప్రతిపాదిక అమలు చేశారు.

వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైన నాటి నుంచి.. కరోనా తగ్గుముఖం పట్టింది. దీంతో కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాక్సినేషన్ ప్ర‌క్రియ‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ కరోనా కేసులు తగ్గుముఖం ప‌డుతు వ‌స్తున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో మ‌రో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వ‌చ్చింది. ప్ర‌పంచ‌దేశాలపై ఒమిక్రాన్ రక్కసి విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వంటి దేశాల్లో కోవిడ్ టీకా 75 శాతం జనాభాకు పంపిణీ చేసినా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.

ఒమిక్రాన్ వేరియంట్ ఇండియాలోనూ విజృంభిస్తోంది. ఇప్ప‌టికే పలు రాష్ట్రాల్లో భారీ సంఖ్య‌లో 
కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇటు డెల్టా వేరియంట్ తో పాటు.. ఒమిక్రాన్ వ్యాప్తి శరవేగంగా  చెందుతుండడంతో భార‌త్ లో థర్డ్ వేవ్ మొదలైంది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లో విధించాయి.   
ఈ క్ర‌మంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజుకు 10వేల పైగా  కరోనా కేసులు నమోదవుతుండడంతో ఏపీ ప్రభుత్వం..  నైట్ కర్ఫ్యూ ను అమ‌లు చేస్తోంది.  ఇదిలా ఉంటే.. తెలంగాణ సైతం కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. అయితే.. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించే.. స్థాయిలో కేసులు లేవ‌ని రాష్ట్ర‌ వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే నైట్ కర్ఫ్యూ అవసరమని అంటున్నారు. తెలంగాణ‌లో ఇప్పటివరకు 2.16 లక్షల మందికి ప్రికాషనరీ డోసు ఇచ్చామని చెప్పారు వైద్యారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్‌) శ్రీనివాసరావు. రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని, ఏ ఒక్క జిల్లాలో పాజిటివిటీ రేటు 10 శాతం మించలేదని తెలిపారు. .
 
వారం రోజులుగా రోజుకు లక్షకుపైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి జ్వర సర్వే జరుగుతున్నదని, మూడు రోజుల్లోనే 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామన్నారు. 15 నుంచి 18 ఏండ్లలోపువారిలో 59 శాతం మందికి వ్యాక్సిన్‌ పంపిణీ చేశామని వెల్లడించారు.

ఇదిలాఉంటే.. రాష్ట్రంలో ప్ర‌తి 2సంవత్సరాలకు ఓసారి నిర్వహించే మేడారం సమ్మక్క-సారక్క జాతర ఈ సమయంలోనే ఆందోళనలు వ్య‌క్తమ‌వుతున్నాయి. ఈ జాత‌ర‌కు దేశం నలుమూలల నుండి భారీ సంఖ్య‌లో భక్తులు వస్తుంటారు. ఈ జాతర స‌మ‌యంలో కరోనా కేసులు పెరిగి అవకాశం కనిపిస్తోంది. ఏపీలో సంక్రాంతి ముందు రోజుకు 5 వేల లోపు కరోనా కేసులు నమోదవుతుండగా.. సంక్రాంతి పండుగ తరువాత 10వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే మేడారం తరువాత కరోనా కేసులు పెరిగితే తెలంగాణ సర్కార్ తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు వైద్య‌నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios