హైద్రాబాద్‌లో ఇద్దరు ఐఎస్ అనుమానితుల అరెస్ట్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 12, Aug 2018, 1:09 PM IST
NIA arrested two persons for terror activities in hyderabad
Highlights

ఇద్దరు ఐఎస్‌ అనుమానితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాజిర్‌ను అరెస్ట్ చేసినట్టు  ఎన్ఐఏ ఆదివారం నాడు ప్రకటించింది.

హైదరాబాద్: ఇద్దరు ఐఎస్‌ అనుమానితులను ఎన్ఐఏ అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాజిర్‌ను అరెస్ట్ చేసినట్టు  ఎన్ఐఏ ఆదివారం నాడు ప్రకటించింది.

వారం రోజులుగా హైద్రాబాద్‌ పాతబస్తీలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. ఈ  సోదాల్లో  అబ్దుల్ బాసిత్, అబ్దుల్ ఖాజిర్‌లను ఎన్ఐఏ పోలీసులు  అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.వారం రోజుల క్రితం వీరిద్దరిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని  విచారణ నిర్వహించారు.  ఖాదిర్ ఇంట్లో దొరికిన హర్డ్ డిస్క్  లభ్యమైంది.ఈ హార్డ్‌డిస్క్ ఆధారంగా  ఎన్ఐఏ  విచారణ చేశారు. 

దేశంలో ఐఎస్‌ను పెంచిపోషించేందుకు వీరిద్దరూ ప్రయత్నాలు చేస్తున్నారని  ఎన్ఐఏ గుర్తించింది.  అంతేకాదు అద్నాస్ హసన్ కేసుతో వీరిద్దరికి కూడ సంబందాలు ఉన్నాయని ఎన్ఐఏ అనుమానిస్తోంది.

వారం రోజులుగా  వీరిద్దరూ ఇచ్చిన సమాచారం మేరకు పాతబస్తీలోని సుమారు 7 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.  పక్కా ఆధారాలను సేకరించిన తర్వాత నిందితులను  అదుపులోకి తీసుకొన్నట్టు  ఎన్ఐఏ ప్రకటించింది. అయితే తమ వారు అమాయకులను ఎన్ఐఏ అరెస్ట్ చేసిన కుటుంబసభ్యులు చెబుతున్నారు. తప్పుడు కేసులను బనాయించారని ఆరోపిస్తున్నారు. 

loader