తల్లి కళ్లముందే కొడుకు మృతి: సుమోటోగా తీసుకొన్న ఎన్‌హెచ్ఆర్‌సీ

కరోనా లక్షణాలతో నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చేరిన యువకుడు ఆక్సిజన్ అందక మరణించిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై ఈ నెల 21వ తేదీ లోపుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

NHRC takes suo moto on Nalgonda hospital incident,ordered to report before july 21


నల్గొండ: కరోనా లక్షణాలతో నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో చేరిన యువకుడు ఆక్సిజన్ అందక మరణించిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై ఈ నెల 21వ తేదీ లోపుగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

మాడ్గులపల్లి మండలంలోని సల్కునూరుకు చెందిన ఓ యువకుడు కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో శనివారం నాడు చేరాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నా కూడ వైద్యులు పట్టించుకోలేదని మృతుడి తల్లి ఆరోపించింది.

ఆక్సిజన్ పెట్టాలని డాక్టర్లను కోరినా కూడ పట్టించుకోలేదని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. కనీసం తన కొడుకుకు వైద్యం అందించని కారణంగానే  అతను మృతి చెందినట్టుగా ఆమె ఆరోపించారు. 

also read:తల్లి కళ్ల ముందే కొడుకు మృతి: ఆక్సిజన్ అందక నల్గొండ ఆసుపత్రిలో యువకుడి కన్నుమూత

ఈ ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఈ ఘటనను సుమోటోగా తీసుకొంది. నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఏం జరిగిందో  నివేదిక ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.

ఈ నెల 21వ తేదీ లోపుగా నివేదిక ఇవ్వాలని ఎన్ హెచ్ ఆర్ సీ కోరింది. జిల్లా కలెక్టర్, డీఎంహెచ్ఓ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ లను ఆదేశించింది జాతీయ మానవ హక్కుల కమిషన్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios