సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్: తెలంగాణ సర్కార్ పై ఎన్జీటీ ఆగ్రహం
సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులు కొనసాగించడంపై తెలంగాణ సర్కార్ పై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతమ్మ సాగర్ పనులు కొనసాగించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఎన్జీటీ గురువారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లేనందున పనులు ఆపాలని గతంలోనే ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. అయినా కూడ పనులు నిర్వహిస్తున్నారని పిటిషనర్లు ఎన్జీటీ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు ద్విసభ్య కమిటీని ఏర్పాటు చేసింది ఎన్జీటీ. ఈ కమిటీ ఈ ఏడాది జూన్ 28వ తేదీన సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ సంస్థ , అధికారులు, స్థానికులతో సమావేశమైంది. ప్రాజెక్టు పనులకు సంబంధించి వివరాలను సేకరించింది. ఎన్జీటీకి ద్విసభ్య కమిటీ నివేదికను సమర్పించింది. ప్రాజెక్టు పనులను కొనసాగించడంపై తెలంగాణ సర్కార్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
also read:సీతమ్మసాగర్ ప్రాజెక్టు: పరిశీలించిన ఎన్జీటీ ద్విసభ్య కమిటీ
పర్యావరణ అనుమతులు లేనందున సీతమ్మసాగర్ పనులు ఆపాలని ఎన్జీటీ ఆదేశించింది. తమ ఆదేశాలు లెక్క చేయకుండా ప్రాజెక్టు పనులు నిర్వహించడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నా ఏం చేస్తున్నారని గోదావరి రివర్ బోర్డు, కేంద్ర పర్యావరణ శాఖలపై ఎన్జీటీ ప్రశ్నించింది.పనులు ఎందుకు ఆపలేదని ప్రశ్నించిందిఎన్జీటీ. ప్రాజెక్టు పనులు నిలిపివేసేందుకు ఏం చర్యలు తీసుకోన్నారో నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశించింది.