హైదరాబాద్: తెలంగాణలో సొమ, మంగళవారాలు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. కోస్తాంధ్ర మీదుగా ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడివుందని.... దీని ప్రభావంతోనే నేడు, రేపు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వెల్లడించారు. 

ఇప్పటికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి రాష్ట్రాన్ని తాకాయి. దీంతో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.