విక్రం గౌడ్ కేసులో కొత్త మలుపు డ్రగ్ వ్యవహారం వెలుగులోకి హత్యాయత్నం కాదని నిర్ధారించిన పోలీసులు అప్పుల పాలైన విక్రం గౌడ్ తండ్రి ఇచ్చిన ఇంటిని అమ్మేసిన విక్రం
బంజారాహిల్స్ లో సంచలనం సృష్టించిన విక్రం గౌడ్ కాల్పుల ఘటన కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా డ్రగ్ వ్యవహారం కూడా ఈ కాల్పుల ఘటనలో చొచ్చుకొని వచ్చింది. విక్రం గౌడ్ డ్రగ్ వ్యవహారంలో భాగస్వామి అన్న ఆరోసణలు వస్తున్నయి. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి.
మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రం గౌడ్ పై శుక్రవారం తెల్లవారుజామున తన ఇంటిలో కాల్పులు జరిగాయి. బయటివారు కాల్పులు జరిపారని విక్రం గౌడ్ భార్య చెబుతున్నారు. ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కానీ బయటి వారెవరూ విక్రం గౌడ్ ను కాల్చలేదని, తానే ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసుల విచారణలో తేలింది.
విక్రం గౌడ్ కు ఒక పబ్ లో వాటా కూడా ఉందని పోలీసులు అంటున్నారు. విక్రం గత కొంతకాలంగా అప్పుల ఊబిలో కూరుకుపోయారని చెబుతున్నరు. మరోవైపు డ్రగ్ కోణం కూడా ఆయన ఆత్మహత్యాయత్నానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. విక్రం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. అయినా విక్రం చాలాసేపటి వరకు నోరు తెరవలేదని చెబుతున్నారు. అంతిమంగా పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ప్రాథమిక సమాచారం సేకరించారు.
అయితే విక్రం గౌడ్ తన దురలవాట్ల కారణంగా తండ్రి ముఖేష్ గౌడ్ ఇచ్చిన ఇంటిని కూడా అమ్ముకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అప్పుల వాళ్ల వత్తిళ్లు తట్టుకోలేక విక్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారా? లేక డ్రగ్ కేసులో తన పేరు బయటకు వస్తుందన్న ఆందోళన నా అన్నది తదుపరి విచారణలో తేలే అవకాశముందని పోలీసులు అంటున్నారు.
