Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ట్విస్ట్.. వారికి బెదిరింపు కాల్స్...

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన ఎమ్మెల్యేలకు గుజరాత్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయని తేలింది. 

New Twist In TRS MLAs Poaching Case, SIT Probe Reveals in hyderabad
Author
First Published Nov 12, 2022, 2:09 PM IST

హైదరాబాద్ : ‘టిఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ముగ్గురు వ్యక్తులు ప్రయత్నించగా.. దీనిని ప్లాన్ ప్రకారం బయటపెట్టిన ఎమ్మెల్యేలకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. గుజరాత్, ఉత్తర ప్రదేశ్ నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని, తమ అంతు చూస్తామని ఫోన్లో బెదిరిస్తున్నారని ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. ఈ విషయాన్ని టిఆర్ఎస్ పార్టీ హైకమాండ్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకెళ్లారు. 

ఈ నేపథ్యంలో  ఎమ్మెల్యేల భద్రతను పోలీసులు సమీక్షించారు. ఇప్పటికే ప్రభుత్వం వీరికి భద్రత పెంచిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు కోసం హైదరాబాద్ సీపీ ఆనందం నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేయగా.. ఈ ప్రత్యేక బృందం నిందితులను అన్ని కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వెనక ఎవరున్నారు అనే కోణంలో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. 

మొయినాబాద్ ఫాంహౌస్ కేసు.. రంగంలోకి సిట్, నిందితులను ప్రశ్నించిన సీవీ ఆనంద్

మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణ వ్యవహారంలో ముగ్గురు నిందితుల రెండు రోజుల కస్టడీ శుక్రవారంతో పూర్తయింది. రెండు రోజులపాటు నిందితులను సీబీఐ విచారించింది. కస్టడీ గడువు ముగియడంతో వారిని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా నిందితుల బెయిల్ పిటిషన్పై వాదనలు విన్న కోర్టు నిందితులకు ఈనెల 25 వరకు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ముగ్గురు నిందితులను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు.

ముగ్గురు నిందితులను రాజేంద్రనగర్ ఎసిపి కార్యాలయంలో రెండు రోజుల పాటు సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను నుంచి వాయిస్ శాంపిల్స్ సేకరించారు. వారిని పలు కోణాల్లో అధికారులు విచారించారు. ఈ వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన రామచంద్ర భారతి వాంగ్మూలం కీలకంగా మారనుందని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన ఎమ్మెల్యేలతో డబ్బు లావాదేవీలపై మాట్లాడటం, పైలట్ రోహిత్ రెడ్డికి రూ.100 కోట్లు.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇప్పిస్తాం అన్నట్టు వీడియోలో కనిపిస్తున్న క్రమంలో ఆ డబ్బును ఎలా సమకూర్చాలనుకున్నారనే విషయంపై విచారణ జరిగినట్లు తెలుస్తోంది. 

తెలంగాణలో మోదీ పర్యటన వేళ ముందస్తు అరెస్ట్‌లు.. మోదీ గో బ్యాక్ అంటూ ఓయూలో నిరసనలు..

కాగా, తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ కేసు దర్యాప్తును ప్రభుత్వం గురువారం సిట్ చేతికి అప్పగించింది. హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ అధ్యక్షతన ఈ సిట్ ను ఏర్పాటు చేశారు. సీవీ ఆనంద్ తో పాటు మరో ఆరుగురు పోలీస్ అధికారులు దీంట్లో సభ్యులుగా వుంటారు. వీరిలో నల్గొండ రెమా రాజేశ్వరి, సైబరాబాద్ క్రైమ్ డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ సీఐ లక్ష్మీరెడ్డిలు ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios