బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. దేవరాజ్ పెళ్లి చేసుకోనని చెప్పడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా పలు ఛానెళ్లలో కథనాలు వస్తున్నాయి.

పెళ్లి చేసుకోనంటూ మెసేజ్ రూపంలో శ్రావణికి దేవరాజ్ తేల్చిచెప్పాడు. మెసేజ్ చూసి తీవ్ర ఆవేదనకు గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకోవాలనుకుందని పోలీసులు వెల్లడించారు.

Also Read:శ్రావణి కేసు: పోలీసుల అదుపులో సాయి- దేవరాజ్, నిందితుడెవరో రేపు తేలిపోనుందా..?

ఈ ఏడాది జూన్‌లో దేవరాజ్‌పై కేసు పెట్టిన తర్వాత, అతనిని శ్రావణి గాఢంగా ప్రేమించింది. ఓ వైపు దేవరాజ్ పెళ్లిని తిరస్కరించడం, మరోవైపు కుటుంబ సభ్యులు సాయికృష్ణను పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకురావడంతో శ్రావణి ఉక్కిరిబిక్కిరయ్యింది.

ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి, దేవరాజ్ ఇద్దరూ తమ అదుపులోనే ఉన్నట్లు ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు. రేపటి లోగా ఈ కేసు కొలిక్కివచ్చే అవకాశం వుందని వెల్లడించారు.