బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు విచారణ తుది దశకు చేరుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి, దేవరాజ్ ఇద్దరూ తమ అదుపులోనే ఉన్నట్లు ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

రేపటి లోగా ఈ కేసు కొలిక్కివచ్చే అవకాశం వుందని వెల్లడించారు. దీనిపై ఇంకా విచారణ జరుగుతోంది. సాయి, దేవరాజ్‌లను రిమాండ్‌కు తరలించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు నిర్మాత అశోక్ రెడ్డిని రేపు పోలీసులు  ప్రశ్నించనున్నారు. శ్రావణి ఆత్మహత్యకు ఆమె టిక్ టాక్ ఫ్రెండ్ దేవరాజే కారణమని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో రెండు రోజుల పాటు దేవరాజును పోలీసులు విచారించారు.

అయితే సాయికృష్ణారెడ్డి కుటుంబసభ్యులు కొట్టడం వల్లే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని దేవరాజ్ పోలీసులకు వివరించాడు. దీనికి సంబంధించిన ఆడియో టేపులను కూడా పోలీసులకు అందజేశాడు.

వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. సాయిని కూడా విచారించారు. అయితే సాయికృష్ణ కొట్టడం వల్ల తమ కుమార్తె ఆత్మహత్య చేసుకోలేదని చెప్పారు శ్రావణి తల్లిదండ్రులు. తనపై కేసును విత్ డ్రా చేసుకునేందుకే దేవరాజ్.. శ్రావణితో ప్రేమ నటించడాని ఆమె ఆరోపించింది.

Also Read:శ్రావణితో నడిరోడ్డుపై సాయి గొడవ : సీసీటీవీ‌లో దృశ్యాలు.. పోలీసులకు కీలక ఆధారం

తన సేఫ్టి కోసమే దేవరాజ్ ఆడియో రికార్డింగ్‌లను దాచుకున్నాడని శ్రావణి తల్లి తెలిపారు. దేవరాజ్‌తో ఛాటింగ్ చేసిన తర్వాతే తన కూతురు ఉరి వేసుకుందని తెలిపింది. దేవరాజ్ చాలా మంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నట్లు శ్రావణి తల్లి ఆరోపించింది.

అటు శ్రావణి ఆత్మహత్యకు సాయే కారణమని దేవరాజు ఆరోపిస్తున్నాడు. శ్రావణి ఆత్మహత్యకు ముందు వేధింపులకు గురిచేశాడని.. దీంతో తీవ్ర మనస్తాపంతోనే శ్రావణి బలవన్మరణానికి పాల్పడిందని చెబుతున్నాడు.

ఈ కేసు నుంచి బయటపడేందుకు నిర్మాత అశోక్ రెడ్డిని కూడా ఇరికించినట్లు వెల్లడించాడు. శ్రావణిని తాను పెళ్లి చేసుకోవాలని అనుకుని వుంటే ఎప్పుడో చేసుకునేవాడినిన సాయి అన్నాడు.

తనతో పెళ్లికి శ్రావణి తల్లిదండ్రులు అంగీకరించినట్లు తెలిపాడు. అయితే ఆత్మహత్యకు ముందు రోజు సాయి, శ్రావణి రోడ్డుపై ఓ హోటల్ ముందు గొడవ పడ్డారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీల్లో రికార్డయ్యింది.

అసలు ఈ గొడవకు ముందు హోటల్‌లో ఏం జరిగింది. అసలు వీరిద్దరు ఎందుకు గొడవ పడ్డారన్న విషయాలపై సాయి వివరణ ఇవ్వలేదు. శ్రావణి కోసం సాయిని తామే పంపినట్లు ఆమె తల్లి చెబుతోంది.