మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామంలో మహేష్ అనే యువకుడి దారుణ హత్యలో కొత్త కోణం వెలుగు చూస్తోంది. యువతి భర్త మృతికి మహేష్ కారణం కావడంతోనే అతని హత్య జరిగినట్టు తేలింది.

మంచిర్యాల : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మంచిర్యాల జిల్లా హత్య కేసులో.. కొత్తకోణం వెలుగు చూసింది. నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే బండిమీద వెళుతున్న మహేష్ అనే యువకుడిని గొంతు కోసి, రాళ్లతో కొట్టి అత్యంత దారుణంగా చంపిన ఘటన మంగళవారం ఉదయం కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివాహితను వేధింపులకు గురి చేస్తున్నాడనే కారణంతో ఆమె కుటుంబ సభ్యులు అతడిని హత్య చేసినట్లుగా తేలింది.

అయితే, సదరు వివాహిత భర్త మృతికి మహేషే కారణం కావడం వల్లే అతడిని హత్య చేసినట్లుగా కొత్త విషయం వెలుగు చూస్తోంది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. సదరు వివాహిత, మహేష్.. ఆమెకు పెళ్లి కాకముందు ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు యువతికి వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. కాగా, మహేష్ ఇది జీర్ణించుకోలేకపోయాడు. తాము ప్రేమలో ఉన్నప్పుడు తీసుకున్న వీడియోలు, ఫోటోలను యువతి భర్తకు పంపించాడు.

అత్తామామలకు కరెంట్ షాక్ పెట్టి చంపాలని అల్లుడి స్కెచ్.. కారణం తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే..

అవి చూసిన యువతి భర్త మనస్థాపానికి లోనయ్యాడు. తన భార్య పెళ్లికి ముందు వేరే వ్యక్తిని ప్రేమించిందన్న విషయాన్ని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు మహేష్ మీద అప్పటినుంచి కోపంగా ఉన్నారు. భర్త చనిపోయి పుట్టింటికి చేరిన తర్వాత.. యువతికి మహేష్ అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం ప్రారంభించాడు. దీంతో, అప్పటికే అదును కోసం వేచి చూస్తున్న యువతి కుటుంబ సభ్యులు.. మహేష్ ను అత్యంత కిరాతకంగా నడిరోడ్డులో అందరూ చూస్తుండగా హతమార్చారు. 

మంచిర్యాలలో దారుణం.. నడిరోడ్డులో యువకుడి గొంతుకోసి, బండరాయితో మోది హత్య...

ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు కలిసి మహేష్ ను బండరాయితో కొట్టి చంపారు. హత్య విషయం తెలియడంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. విచారణ చేపట్టగా ఈ విషయాలు వెలుగు చూసాయి. మహేష్ హత్యలో నిందితులైన ఎవరినీ వదిలిపెట్టమని పోలీసులు చెబుతున్నారు.