పాన్‌లో మత్తు మందు కేసు: యువతిపై అనుమానాలు

First Published 13, Jun 2018, 1:04 PM IST
New Twist in Hyderabad mayur pan shop case
Highlights

పాన్‌లో మత్తు మందు కేసు: యువతిపై అనుమానాలు

ఫేస్‌బుక్‌లో తనను పరిచయం చేసుకుని.. ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేశాడని.. స్వీట్ పాన్‌లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడని.. హైదరాబాద్‌లోని ప్రముఖ పాన్ షాప్ రిటైల్ వ్యాపారి ఉపేంద్ర వర్మపై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని చేసిన ఆరోపణలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. ఆరోపణలు చేయడమే కాకుండా చనువుగా ఉన్న ఫోటోలను పోలీసులకు, మీడియాకు సమర్పించింది. అయితే ఆ కేసు ఇప్పుడు కీలకమలుపు తిరిగింది.

ఉపేంద్ర వర్మపై ఆరోపణలు చేసిన సదరు యువతి గతంలో పలువురు యువకులతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. ఆమె గతంలో ఎంతో మంది అబ్బాయిలతో సన్నిహితంగా ఉంటూ.. వారిని మోసం చేసిందని.. ఇప్పుడు తన సోదరుడిపై వల పన్నిందంటూ ఉపేంద్రవర్మ సోదరుడు సురేంద్ర వర్మ.. కొందరు యువకులతో ఆ యువతి సన్నిహితంగా ఉన్న ఫోటోలను పోలీసులకు సమర్పించారు.

ఆమె తన తమ్ముడి నుంచి కోటి రూపాయలను డిమాండ్ చేసిందని... అందుకు తన సోదరుడు నిరాకరించడంతోనే కేసు పెట్టిందని ఆరోపించాడు. అంతేకాకుండా తమ షాపుల్లో మత్తుమందులు కలిపిన పాన్‌లు తయారు చేస్తున్నట్లు నిరూపిస్తే.. నగరంలో ఉన్న అన్ని షాపులు మూసేస్తామని చెప్పాడు.

 

loader