Asianet News TeluguAsianet News Telugu

బొడ్డుపల్లి శీను హత్య కేసులో బిగ్ ట్విస్ట్

  • ఎ1 నుంచి ఎ5 నిందితుల వరకు కస్టడీకి అనుమతి
  • జిల్లా కోర్టు నుంచి ఉత్తర్వులు అందుకున్న పోలీసులు
new twist in boddupally srinivas murder case

బొడ్డుపల్లి శీను హత్య కేసులో బిగ్ ట్విస్ట్

నల్లగొండ పట్టణంలో సంచలనం రేపిన మున్సిపల్ ఛైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసు మరో మలుపు తిరిగింది. రాజకీయ రంగు పులుముకున్న ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ మిస్టరీగా మారుతున్నది.

తాజాగా బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో నిందితులను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు నల్లగొండ జిల్లా న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. హత్య కేసులో ఉన్న నిందితుల్లో ఎ1 నుంచి ఎ5 వరకు వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది జిల్లా కోర్టు.

నిందితుల్లో
ఎ1 రాంబాబు

ఎ2 మాండ్ర మల్లేష్

ఎ3 ఆవుల శరత్ రాజ్

ఎ4 బి. దుర్గయ్య

ఎ5 చక్రి

వీరందరినీ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. వారిని మరోసారి విచారణ జరిపి నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించే చాన్స్ ఉంది. ప్రస్తుతం వీరంతా రిమాండ్ లో ఉన్నారు. ఎ6 నుంచి ఎ11 వరకు నిందితులందరికీ గతంలోనే బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.

ప్రస్తుతం బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఎ6 నుంచి పైనున్న నిందితులకు బెయిల్ మంజూరైంది. వారికి క్షణాల తేడాతో వారికి బెయిల్ ఎలా వచ్చిందని రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారం రేగింది. దీనిపై నల్లగొండ పోలీసుల తీరు అనుమానాలకు తావిచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసులు నిందితులతో చేతులు కలిపారని నిప్పులు చెరిగారు.

ఈ పరిస్థితుల్లో... నష్ట నివారణ చర్యలకు దిగారు నల్లగొండ పోలీసులు. బెయిల్ మంజూరైన నిందితులకు బెయిల్ రద్దు పిటిషన్ ను జిల్లా కోర్టులో ఫైల్ చేశారు. దాంతోపాటు రిమాండ్ లో ఉన్న ఎ1 నుంచి ఎ5 వరకు ఉన్న ఖైదీలను కస్టడీ కోసం కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టలో కస్టడీ పిటిషన్ పై తీర్పు వెలవడింది. కస్టడీకి తీసుకోవచ్చంటూ న్యాయస్థానం అనుమతించడంతో పోలీసులు సెకండ్ ఫేజ్ యాక్షన్ షురూ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

ఇక ఈ కేసులోనే సందుట్లో సడేమియా అన్నట్లు ఈ కేసు విచారణాధికారిగా ఉన్న సిఐ వెంకటేశ్వర్లు చెప్పా పెట్టకుండా 34 గంటల పాటు మాయమైపోయి మరో షాక్ ఇచ్చారు. సిమ్ కార్డు, వెపన్ వాపస్ ఇచ్చి గుంటూరు జిల్లాకు వెళ్లిపోయారు. పోలీసులు వెతికి వెతికి మరీ ఆయనను తీసుకొచ్చి తిరిగి డ్యూటీలో చేర్పించారు.

మొత్తానికి పోలీసు కస్డడీకి నిందితులను తీసుకోనున్న తరుణంలో ఈ కేసు మరో ములపు తిరిగే చాన్స్ ఉందా? లేదంటే గతంలో కేసుల మాదిరిగానే మమ అనిపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios