18290 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్. 9629 సివిల్ ఉద్యోగాలు.
నిరుద్యోగులకు శుభవార్త. పోలీసు శాఖలో భారీగా ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ అనురాగ్ శర్మ మంగళవారం అధికారికంగా ఖాళీలకు ను భర్తీలకు నోటిఫికేషన్ ప్రకటించారు.
పోలీసు శాఖలో 18290 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది అందులో 9629 సివిల్ ఉద్యోగాలు, 5738 ఎఆర్ పోస్టులు, 2075 టీఎస్ఎస్పి, 143 కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో భర్తీ చెయ్యనున్నారు. వాటికి సంబంధించిన వివరాలు త్వరలో టీఎస్ఎల్పీఆర్బీ సైట్ లో పొందుపర్చనున్నారు.
