Asianet News TeluguAsianet News Telugu

ఇంద్రవెల్లికి, ప్రొఫెసర్ జయశంకర్ కు కొత్త ప్రభుత్వం ఘననివాళి...

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటోంది. పదేళ్ల తెలంగాణ విస్మరించినవి నెరవేరుస్తుంది. 

New government pays tribute to Indravelli, Telangana ideologue - bsb
Author
First Published Dec 8, 2023, 12:15 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయనను తెలంగాణ జాతిపిత అనాలి. కానీ, ఇన్నేళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఆయనకు అందాల్సిన సముచిత గౌరవం అందలేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చూడాలన్నది ప్రొ జయశంకర్ సార్ చిరకాల స్వప్నం. సమున్నత ఆశయం. కానీ, అది నెరవేరేలోగా వారు కన్ను మూశారు. ప్రొ. జయశంకర్ సార్ ఆశయసాధనల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఉద్యమపార్టీ రాజకీయ పార్టీగా మారింది. 

ఆయన ఆశయాల అడుగుజాడల్లో ఏర్పడిందని చెప్పిన ప్రభుత్వం.. ఆ తరువాత ఆయనను పట్టించుకోలేదు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం జయశంకర్ సార్ ‘జాతి పిత’ కాలేదు. ఆయనకు ప్రభుత్వం అర్పించవలసిన ఘన నివాళి గత పదేళ్ళలో జరగనే లేదు. ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు అమరవీరుల కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. ఇంద్రవెల్లిలో అమరవీరుల స్తూపాన్నీ పట్టించుకోలేదు. 

కానీ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దింది. వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ఏర్పాటుచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అంతేకాదు వెంటనే అమలయ్యేలా.. ప్రాథమిక ప్రకటనను జీ.ఓ. నెంబర్ 405ను ప్రభుత్వం శుక్రవారం డిసెంబర్ 8న విడుదల చేసింది. ప్రస్తుతం అక్కంపేట పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉంది. 

త్వరలోనే మంచిరోజులు వస్తాయన్నారు... ఇంతలోనే ఇలా : కేసీఆర్ గాయంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆవేదన

దీంతోపాటు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఇంద్రవెల్లి గ్రామం-బి లో ఉన్న అమరవీరుల స్తూపం వద్దగల స్మృతి వనం సుందరీకరణ, అభివృద్ధికి ఒక ఎకరం భూమి కేటాయింపునకు సంబంధించిన జిఓను ప్రభుత్వం జారీ చేసింది. అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవలసిందిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అదిలాబాద్ కలెక్టర్ ను ఆదేశించారు.

ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని భూమికోసం జరిగిన పోరాటంలో ప్రాణాలు అర్పించిన వారి జ్ఞాపకార్థం నిర్మించారు. రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఈ స్థూపాన్ని నిర్మించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని 1986 మార్చి 19న  పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూరు, నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత మీద అనేక పుస్తకాలు రాశారు. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషుల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. తెలంగాణ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ ఏర్పాటులో కేసీఆర్ కు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి ఉన్నారు. దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేసిన జయశంకర్ సార్ 2011, జూన్ 21న చనిపోయారు. చివరికి తెలంగాణ ఏర్పాటును చూడకుండానే కన్నుమూశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios