Asianet News TeluguAsianet News Telugu

మ‌రో క‌ల్తీ దందా గుట్టు ర‌ట్ట‌యింది.

  • మరో కల్తీ గట్టు రట్టు.
  • పచ్చళ్ల తయారిలో కల్తీ దినుసులు.
  •  
new food poision in telanaga

 ఇప్పుడు ప్ర‌తి వ‌స్తువును క‌ల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. మ‌నం రోజు వారిగా వాడే ప్ర‌తి వ‌స్తువును ఊహించ‌ని రీతిలో క‌ల్తీ చేసున్నారు. నూనే, బియ్యం, పాలు ఒకటి రెండు ఏంటి ప్ర‌తి వ‌స్తువును కల్తీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు.ఇప్ప‌టికే చాలా కల్తీ వ్య‌వ‌హారాలు బ‌య‌టప‌డ్డాయి. ఇప్పుడు అలాంటే వ్య‌వ‌హారం మ‌రోటి బ‌య‌ట‌ప‌డింది.

 న‌గ‌ర శివార్ల‌లో ఉన్న జీడిమెట్లలో కల్తీ పచ్చళ్ల దందా వెలుగు చూసింది. ప‌చ్చ‌ళ్ల త‌యారికి కల్తీ వ‌స్తువుల‌ను క‌లిపి త‌యారు చేస్తున్నార‌ని స‌మాచారం తెలుసుకున్న పోలీసు అధికారులు రంగంలోకి దిగారు. సంఘ‌ట‌న ప్రాంతంలో చాలా మంది వారు చేస్తున్న ప‌ని చూసి ఆశ్చ‌ర్య‌పోయ్యారు పోలీసులు. డబ్బాలకొద్దీ పాడైపోయిన పచ్చళ్లను, కల్తీ కారంపొడి, కల్తీ ఆవపొడి సహా కల్తీ ఇత‌ర‌ ముడిసరుకుతో పచ్చళ్లను తయారీ చేస్తున్నట్టు తెలిపారు. సదరు ముఠా పచ్చళ్ల తయారీకి పప్పులు, ధనియాలు, నూనెల నుంచి ఆవాల వరకు అన్నీ కల్తీవే ఉపయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు.

నేడు ఉద‌యం ఒక అగంతుకుడి కాల్ తో విచార‌ణ‌కు వెళ్లినా పోలీసులు కల్తీ ర‌ట్టును గుట్టు చేశారు. కల్తీ ప‌చ్చ‌ళ్ల‌ను త‌యారు చేస్తున్న 25 మందిని  పోలీసులు ప‌ట్టుకున్నారు. ఆ ప్రాంతంలో సుమారు రూ.15 లక్షల విలువైన కల్తీ పచ్చళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు కంపెనీ య‌జ‌మానిపై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios