తెలంగాణలో పురాతన కళావైభవాన్ని ప్రస్తుత తరానికి తెలియ చేసేందుకు... నాటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని భావితరాలకు అందించేందుకు... గద్వాల కోటలోని భూ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా సంబరాలు జరుపనున్నారు. ఎమ్మెల్యే డికే అరుణ, డికే శ్రుతి రెడ్డి సహకారంతో పరంపర ట్రస్ట్ ఆధ్వర్యంలో గుడి సంబరాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

కోటలోని మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ కళాశాల ప్రాంగణంలో శని, ఆదివారాల్లో నాటక ప్రదర్శలు నిర్వహిస్తారు. రెండు రోజుల పాటు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలచిన మాయాబజార్, పాతాలభైరవి నాటక ప్రదర్శనలు ఉంటాయి. నాటక ప్రదర్శనలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సురభి నాటక రంగ కళాకారులు ఇవ్వనున్నారు. జిల్లా ప్రజలు, కళాకారులు, కళాభిమానులు  రెండు రోజుల పాటు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు గడ్డం కృష్ణారెడ్డి తెలిపారు.