యువజన విభాగంలో పోస్టుల భర్తీ చేసిన కోదండరాం

తెలంగాణ జన సమితి పార్టీకి అనుబంధంగా తెలంగాణ యువజన సమితి రాష్ట్ర కో అర్డినేషన్ కమిటీ శుక్రవారం ఏర్పాటైంది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షులు కోదండరాం సమక్షంలో యువజన విభాగం నేతలు సమావేశమయ్యారు. యువజన విభాగం బలోపేతం కోసం కోదండరాం పలు సూచనలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న స్వార్థ, అసమర్థ రాజకీయాలను సమూలంగా మార్చడానికి యువత పెద్ద సంఖ్యలో యువజన సమితిలో చేరాలని కోదండరాం పిలుపునిచ్చారు. భారీగా సభ్యత్వ నమోదు, యువజన విభాగం నిర్మాణంపై తక్షణమే దృష్టి సారించాలని యువజన నాయకులకు కోదండరాం సూచించారు.

తెలంగాణ సమితి రాష్ట్ర కో ఆర్డినేటర్లు వీరే :

1. ఆశప్ప - ఓయూ

2. సలీంపాష - ఓయూ

3. కల్వకుర్తి ఆంజనేయులు - ఓయూ

4. మాలిగ లింగస్వామి - ఓయూ

5. పూసల రమేష్ - ఓయూ

6. వినయ్ - హైదరాబాద్

7. రమణ్ సింగ్ - హైదరాబాద్

8. పూడూరి అజయ్ - వికారాబాద్

9. వెంకట్ రెడ్డి - సూర్యాపేట

10. శేషు - కేయూ

11. డా. సంజీవ్ - కేయూ

12. డా. విజయ్ - కేయూ

13. నరైన్ - హైదరాబాద్

14. దాసరి శ్రీను - భూపాలపల్లి

15. భరత్ - కొత్తగూడెం