కేటీఆర్ వర్క్ ఫ్రం హోం ట్వీట్ కి.. రామారావు ఆన్ డ్యూటీ అంటూ నెటిజన్ల కామెంట్స్...

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మూడు వారాల విశ్రాంతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇంట్లోనుంచే కొన్ని ఫైళ్లు చూశానంటూ.. వర్క్ ఫ్రంహోం అని సరదాగా ఫొటో ట్వీట్ చేశారు.

Netizens comments on KTR work from home tweet

హైదరాబాద్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గాయపడిన సంగతి తెలిసిందే. ఎడమ కాలి చీలమండ కండరంగాయంతో బాధపడుతూ మూడు వారాల విశ్రాంతిలో ఉన్నారు ఆయన. ఈ క్రమంలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లు రిఫర్ చేయాలంటూ ఆయన నెటిజన్లను కోరారు. ఇక ఇప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్ రామారావు తన విభాగం ఫైల్స్ ను చూస్తున్న ఫోటోను మంగళవారం ట్విట్టర్లో షేర్ చేశారు. వర్క్ ఫ్రంహోంలోనూ కొన్ని ఫైళ్లకు సంబంధించిన పని జరుగుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. 

ఇదిలా ఉంటే, తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాట్సప్ అకౌంట్ బ్లాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘వాట్సాప్ ఆగిపోయింది. నిన్నటి నుంచి మూడుసార్లు వాట్స్అప్ సేవలు నిలిచిపోయాయి.  ఎనిమిది వేల కంటే ఎక్కువ మెసేజ్లు వచ్చాయి. వీలైనన్ని ఎక్కువ మెసేజ్లకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ క్రమంలోనే మూడుసార్లు నా వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. గత 24 గంటలుగా వాట్సప్ అకౌంట్ పనిచేయడం లేదు. డిజిటల్ సవాళ్లు చాలా క్లిష్టంగా ఉంటాయి’ అంటూ ట్వీట్ చేశారు.

మంత్రి కేటీఆర్ వాట్సాప్ బ్లాక్.. 24 గంటల్లో మూడుసార్లు అంతరాయం...

ఇదిలా ఉండగా ఎడమ కాలి వేలికి గాయం కావడంతో కేటీఆర్ ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే కేటీఆర్ ఆరోగ్య సమాచారం కోసం బంధు మిత్రులు, టిఆర్ఎస్ శ్రేణులు  ఆయన వాట్సాప్ కు మెసేజ్ పంపుతున్నారు. ఆ మెసేజ్ లతో ఫ్లో ఎక్కువై వాట్సాప్ ఖాతా నిలిచి పోయినట్లు తెలుస్తోంది. మరోవైపు కాలికి దెబ్బ తగిలిన విశ్రాంతి తీసుకుంటూ ఇంటి నుంచే పని చేస్తున్నానని తెలిపారు కేటీఆర్. వర్క్ ఫ్రం హోం అంటూ ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా, జులై 23న మహేంద్ర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు శనివారం ఉదయం ప్రగతి భవన్ నుంచి బయలుదేరుతుండగా కేటీఆర్ కాలు మెలిక పడింది. దీంతో నొప్పిని భరిస్తూనే ఆయన స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. మహేంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద మహీంద్రాతో కలిసి అక్కడే భోజనం చేశారు. అయితే నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలో ఎడమ కాలి చీలమండలో చీలిక ఏర్పడినట్లు గుర్తించిన వైద్యులు మూడువారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. తాను గాయపడిన విషయాన్ని మంత్రి ట్విటర్ ద్వారా స్వయంగా ప్రకటించారు.

దీని మీద వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల స్పందిస్తూ కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అంతే కాదు విశ్రాంతి సమయంలో ఓటీటీలో మంచి సినిమాలు, వెబ్ సిరీస్ లు ఉంటే చెప్పాలని కేటీఆర్కు షర్మిల సెటైర్లు వేశారు. మీకోసం కుట్ర సిద్ధాంతం, క్లౌడ్ బరస్ట్, నీటమునిగిన ఇల్లు, పంపు హౌస్ లు ఉన్నాయని ఆమె అన్నారు. కాగా, కేటీఆర్ గాయపడిన విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పలువురు ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios