Asianet News TeluguAsianet News Telugu

నేషనల్ డాక్టర్స్ డే : అమ్మ మనకు జన్మనిస్తే వైద్యుల పునర్జననిస్తున్నారు.. హరీశ్ రావు

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా నిస్వార్ధంగా, నిబద్దతతో సేవలు అందిస్తున్న వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు అందించారు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

national doctors day : minister harishrao wishes to doctors - bsb
Author
Hyderabad, First Published Jul 1, 2021, 12:38 PM IST

జాతీయ వైద్యుల దినోత్సవం సందర్బంగా నిస్వార్ధంగా, నిబద్దతతో సేవలు అందిస్తున్న వైద్యులకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు అందించారు తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా డాక్టర్లందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

‘అమ్మ మనకు జన్మనిస్తే డాక్టర్లు పునర్జనిస్తున్నారు. కరోనాపై పోరాటంలో మన డాక్టర్లు చూపుతున్న అంకితభావం, త్యాగనిరతి అద్భుతమైనవి. విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలనే పణంగా పెడుతూ సైనికుల్లా పనిచేస్తున్న వైద్యులందరికీ, డాక్టర్స్ డే శుభాకాంక్షలు. వీరికి అండగా ఉండటం మన బాధ్యత’ అని ట్వీట్ చేశారు. 

కాగా, ఏపి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు.  అపాయం ముంచుకోస్తుందని తెలిసినా వెన్ను చూపని నైజం వైద్యులదని... ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైద్య సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. 

వైద్యో నారాయణో హరి... ప్రత్యక్ష దైవాలకు చేతులెత్తి మొక్కుతున్నా: చంద్రబాబు...

''ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నివారణకు అవిశ్రాంతంగా వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయం. కరోనా బారిన పడిన వారిని రక్షించడానికి రాత్రీ పగలు తేడా లేకుండా శ్రమిస్తున్నారు. కనిపించని శత్రువుకు భయపడకుండా కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సుకు పాటుపడుతున్నారు'' అని అన్నారు. 

''వైద్యులు దేవుళ్ళతో సమానం అంటారు. కరోనా ప్రజలను వణికిస్తున్న విపత్కర పరిస్థితులల్లో సేవలు అందించడానికి ఏ మాత్రం వెనుకంజ వేయని వైద్యులు నిజంగానే దేవుళ్ళతో సమానం.... నిస్వార్ధంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యులకు,వైద్య సిబ్బందికి వందనం.. అభివందనం. అలాంటి వైద్యులందరికి మరోసారి  జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను'' అని అన్నారు వైద్యశాఖ మంత్రి ఆళ్ళ నాని. 

Follow Us:
Download App:
  • android
  • ios