Asianet News TeluguAsianet News Telugu

శిల్పా చౌదరిని కస్టడీలోకి తీసుకొన్న పోలీసులు: బ్యాంకు లాకర్లు తెరిచే చాన్స్


శిల్పా చౌదరిని బ్యాంకు లాకర్లను ఇవాళ పోలీసులు తెరవనున్నారు. ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఇవాళ శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. గతంలో శిల్పా చౌదరి ఇంట్లో లాకర్లలో ఎలాంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేదు. దీంతో బ్యాంకు లాకర్లను తెరవాలని పోలీసులు ప్రయత్నించనున్నారు.

Narsing Police Takes  shilpa Chowdary  into Custody
Author
Hyderabad, First Published Dec 14, 2021, 12:23 PM IST

హైదరాబాద్: కిట్టీ పార్టీల పేరుతో ప్రముఖుల నుండి డబ్బులు వసూలు చేసిన శిల్పా చౌదరిని  పోలీసులు మంగళవారం నాడు మరోసారి కస్టడీలోకి తీసుకొన్నారు. ఇవాళ శిల్పా చౌదరికి చెందిన బ్యాంకు లాకర్లను పోలీసులు తెరవనున్నారు.Upparpally court  శిల్పా చౌదరి ని ఒక్క రోజు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. దీంతో మంగళవారం నాడు శిల్పా చౌదరి సమక్షంలోనే Bank లాకర్లను పోలీసులు తెరవనున్నారు. Shilpa Chowdary నివాసంలో ఉన్న లాకర్లలో పోలీసులకు ఎలాంటి కీలకమైన డాక్యుమెంట్లు లభ్యం కాలేదు. దీంతో బ్యాంకు లాకర్లను తెరవాలని పోలీసులు భావిస్తున్నారు.

kitty నార్టీల పేరుతో పలువురిని మోసం చేసినట్టుగా శిల్పా చౌదరిపై కేసులు నమోదయ్యాయి. సినీ నటుల కుటుంబాలతో పాటు పోలీస్ అధికారులు, వీఐపీలను లక్ష్యంగా చేసుకొని  శిల్పా చౌదరి డబ్బులను వసూలు చేసిందని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టైన శిల్పా చౌదరిని గత వారంలో మూడు రోజుల పాటు పోలీసులు కస్టడీలోకి తీసుకొన్నారు. అయితే పోలీస్ కస్డడీలో ఆమె నోరు విప్పలేదు.  అంతేకాదు  శని, ఆదివారాలు కూడా కావడంతో బ్యాంకు లావాదేవీలను తెలుసుకొనే అవకాశం లేకుండా పోయిందని  పోలీసులు చెబుతున్నారు. దీంతో ఇవాళ ఆమెను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఉప్పర్‌పల్లి కోర్టులో పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. 

also read:రేపు మరోసారి పోలీస్ కస్టడీకి: శిల్పా చౌదరి బ్యాంకు లాకర్లను తెరవనున్న పోలీసులు

ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని వారి నుండి డబ్బులు వసూలు చేసేందుకు కిట్టీ పార్టీలను ఏర్పాటు చేసేదని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఎక్కువ వడ్డీ ఆశ చూపి కోట్లాది రూపాయాలను వసూలు చేసిందని ఆమెపై పలువురు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు.  మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉన్న శిల్పా చౌదరి పోలీసులకు చుక్కలు చూపించింది. ఎన్నారై ప్రతాప్ రెడ్డి, మల్లారెడ్డి, రాధికారెడ్డిల నుండి తనకు డబ్బులు రావాల్సి ఉందని శిల్పా చౌదరి పోలీసుల విచారణలో తెలిపిందని సమాచారం.

శిల్పా చౌదరి చెప్పిన సమాచారం ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. ఎన్నారై ప్రతాప్ రెడ్డికి పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఎన్నారై ప్రతాప్ రెడ్డి మాత్రం పోలీసులకు భిన్నమైన సమాధానం చెప్పారని తెలుస్తోంది. తనకే శిల్పా చౌదరి డబ్బులు ఇవ్వాలని  చెప్పారని తెలుస్తోంది.

పుప్పాలగూడకు చెందిన దివ్యారెడ్డి తొలుత పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.  ఆ తర్వాత పలువురు వరుసగా శిల్పా చౌదరి ద్వారా తాము మోసపోయినట్టుగా పోలీసులను ఆశ్రయించారు. రోజుకొకరు శిల్పా చౌదరి తమ వద్ద నుండి డబ్బులు తీసుకొని మోసపోయామని ఫిర్యాదులు చేశారు.మరో వైపు తనకు డబ్బులు ఇచ్చిన వారు తనకు డబ్బులు తిరిగి ఇస్తే బాధితులకు డబ్బులు ఇస్తామని శిల్పా చౌదరి పోలీసులకు చెప్పినట్టుగా సమాచారం.శిల్పా చౌదరి పలువురు సినీ హీరోల కుటుంబాలను కూడా మోసం చేసినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ మేరకు సినీ ప్రముఖులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios