సూత్రధార్ నిర్వహకుడు వినయ్ వర్మను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: సూత్రధార్ నిర్వహకుడు వినయ్ వర్మను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు.వినయ్ వర్మపై పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.
సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పేయాలని ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి సూత్రధార్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ యజమాని వినయ్ వర్మ ను అరెస్ట్ చేశారు.
వినయ్ వర్మను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఈ నెల 17వ తేదీన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు యాక్టింగ్ ఇనిస్టిట్యూట్‌లో తనిఖీలు నిర్వహించారు. వినయ్ వర్మ గతంలో కూడ ఇదే తరహాలో యాక్టింగ్ నేర్చుకొనేందుకు వచ్చిన వారిని ఇలానే వేధింపులకు గురి చేసినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి.
సంబంధిత వార్తలు
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Apr 23, 2019, 5:01 PM IST