రాజకీయ దురుద్దేశ్యంతోనే డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత:నందకుమార్ భార్య
రాజకీయ దురుద్దేశ్యంతోనే డెక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేశారని నందకుమార్ భార్య చిత్ర ఆరోపించారు. హోటల్ కూల్చివేతను నందకుమార్ భార్య అడ్డుకొనే ప్రయత్నం చేశారు.
హైదరాబాద్:డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత అక్రమమని నందకుమార్ భార్య చిత్ర చెప్పారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో నందకుమార్ భార్య,కొడుకు వాగ్వాదానికి దిగారు. తాము కోర్టు నుండి స్టే తెచ్చుకున్నా కూడా కనీసం పట్టించుకోకుండా కూల్చి వేశారని ఆమె మీడియాకు చెప్పారు. డెక్కన్ కిచెన్ హోటల్ లో సిట్ బృందం నిన్న పరిశీలించింది. ఈ హోటల్ అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. తమకు ఎలాంటి నోటీసులు అందించలేదని నందకుమార్ కుటుంబసభ్యులు చెప్పారు. కోర్టు నుండి తాము తెచ్చుకున్న స్టే ఆర్డర్ ను తెచ్చుకున్నామన్నారు.ఇంతకాలం పాటు అక్రమ నిర్మాణంగా లేని ఈ హోటల్ ఇప్పుడే ఎలా అక్రమమని తేలిందని ఆమె ప్రశ్నించారు. తమను భోజనం కూడా చేయకుండా అడ్డుకున్నారని ఆమె చెప్పారు.
alsoread:మొయినాబాద్ ఫాంహౌస్ కేసు : నిందితుడు నందకుమార్ హోటల్‌ని కూల్చేసిన పోలీసులు
ఈ స్టే ఆర్ఢర్ ను అధికారులు ఎవరూ కూడ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. హోటల్ లో ఉన్నమెటీరియల్ తీసుకొనే సమయం కూడా ఇవ్వలేదన్నారు. ఈ కూల్చివేతల వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ఆమె ఆరోపించారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో చిత్రతో పాటు ఆమె కొడుకు వాగ్వాదానికి దిగారు. టీఆర్ఎఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నందకుమార్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నందకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నందకుమార్ కీలకపాత్ర పోసించారు. రామచంద్రభారతి, సింహయాజీలతో పాటు ఎమ్మెల్యేలతో మాట్లాడడంలో నందకుమార్ ఫోన్లలో మాట్లాడినట్టుగా ఆడియో సంభాషణలు వెలుగు చూశాయి.