నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీల నేపథ్యంలో సొసైటీ కార్యదర్శి స్పందించారు. 80 ఏళ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ను నడిపిస్తున్నామన్నారు. మొదటిసారి సొసైటీలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ తనిఖీల నేపథ్యంలో సొసైటీ కార్యదర్శి స్పందించారు. 80 ఏళ్ల నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ను నడిపిస్తున్నామన్నారు. మొదటిసారి సొసైటీలో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయని చెప్పారు. సొసైటీలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని కార్యదర్శి తెలిపారు. ఈ విషయంలో ఈటలకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. సొసైటీలో మొత్తం 250 మంది సభ్యులు వున్నారని... అకౌంట్స్ ప్రతి ఏడాది ఆడిట్ చేస్తామని కార్యదర్శి పేర్కొన్నారు. 

అంతకుముందు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సొసైటీ ఛైర్మన్ పదవికి ఇటీవలే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామా నేపథ్యంలోనే సొసైటీ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గత కొన్నాళ్లుగా లావాదేవీలపై ఏసీబీ ఆరా తీస్తోంది. 

Also Read:ఇటీవలే ఈటల రాజీనామా.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు

కాగా, భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను ఎగ్జిబిషన్‌ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు.

అయితే త్వరలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవిని మంత్రి కేటీఆర్‌కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్లుగా తెలుస్తోంది. 81 ఏళ్ల హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ చరిత్రలో పదవీకాలం మధ్యలో ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈటల స్థానంలో మంత్రి కేటీఆర్‌ను అధ్యక్షునిగా నియమించాలని మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది.