నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. సొసైటీ ఛైర్మన్ పదవికి ఇటీవలే మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామా  చేసిన సంగతి తెలిసిందే. ఈటల రాజీనామా నేపథ్యంలోనే సొసైటీ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. గత కొన్నాళ్లుగా లావాదేవీలపై ఏసీబీ ఆరా తీస్తోంది.  

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Also Read:నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవికి ఈటల రాజీనామా.. కేటీఆర్‌కే ఆ పోస్ట్, ఫిక్స్!

కాగా, భూకబ్జా ఆరోపణలతో కేబినెట్ నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా లేఖను ఎగ్జిబిషన్‌ సొసైటీ సెక్రటరీకి ఈటల పంపారు. 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్‌గా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా జరిగిన పరిణామాలతో ఆయన తన పదవి నుంచి వైదొలిగారు.

అయితే త్వరలోనే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవిని మంత్రి కేటీఆర్‌కు ఇచ్చే యోచనలో పాలకమండలి ఉన్నట్లుగా తెలుస్తోంది. 81 ఏళ్ల హైదరాబాద్‌ ఎగ్జిబిషన్‌ సొసైటీ చరిత్రలో పదవీకాలం మధ్యలో ఓ అధ్యక్షుడు రాజీనామా చేయడం ఇదే తొలిసారి. ఈటల స్థానంలో మంత్రి కేటీఆర్‌ను అధ్యక్షునిగా నియమించాలని మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి సీఎం కేసీఆర్ తొలగించడంతో ఈటల ఆ వెంటనే ఎమ్మెల్యే పదవి‌తోపాటు టీఆర్ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజేందర్ బీజేపీలో చేరారు.