పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది.
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు రాకేష్ రెడ్డికి జీవిత ఖైదు విధించింది.
ఇదిలావుండగా.. చిగురుపాటి జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డిని ఈ నెల 6న నాంపల్లి కోర్ట్ దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. అలాగే హత్య కేసులో 11 మందిని నిర్దోషులుగా తేల్చింది. ఈ కేసుకు సంబంధించి 23 పేజీల ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అందులో 12 మందిని నిందితులుగా చేర్చగా, 73 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది.
2019 జనవరి 30వ తేదీన డాక్టర్ చిగురుపాటి జయరాంను హనీట్రాప్ ద్వారా..జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రాకేశ్ రెడ్డి తన నివాసానికి రప్పించాడు. ఆర్ధిక లావాదేవీలకు సంబంధించి డాక్టర్ జయరాంను నిర్భంధించి హత్య చేశాడు. తరువాత జయరాం మృతదేహాన్ని కారులోకి ఎక్కించి ఆంధ్రా- తెలంగాణ బోర్డర్‌లో పడేశాడు. అనంతరం దీనిని తన స్నేహితులతో కలిసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడు. ఆర్ధిక లావాదేవీల కారణంగానే రాకేశ్.. జయరాంను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
