Asianet News TeluguAsianet News Telugu

మైనర్‌ బాలికపై అత్యాచారం.. హోంగార్డ్‌కి 30 ఏళ్ల జైలు, నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు బాధితురాలికి కుటుంబానికి 40 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

Nampally Court Verdict 30 year jail For homegaurd in minor girl rape case ksp
Author
hyderabad, First Published Aug 3, 2021, 8:12 PM IST

మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో హోంగార్డుకు 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి కోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లోని తుకారం గేట్‌ వద్ద మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. హోంగార్డ్ మల్లిఖార్జున్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో అన్ని రిపోర్టులు పరిశీలించి, ఆధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు పోలీసులు. దీంతో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్షతో పాటు బాధితురాలికి కుటుంబానికి 40 వేలు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios