తెలుగు అకాడమీ స్కాం: సీసీఎస్ కస్టడీకి మస్తాన్‌వలీ.. పెండింగ్‌లో మరో ముగ్గురి పిటిషన్
తెలుగు అకాడమీ (Telugu Academy) కేసులో నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్ట్ (Nampally Court). యూనియన్ బ్యాంక్ (Union Bank) మేనేజర్ మస్తాన్‌వలీ (Mastanvali)ని కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం .
తెలుగు అకాడమీ (Telugu Academy) కేసులో నిందితులను పోలీసు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్ట్ (Nampally Court). యూనియన్ బ్యాంక్ (Union Bank) మేనేజర్ మస్తాన్‌వలీ (Mastanvali)ని కస్టడీకి అనుమతించింది న్యాయస్థానం . అయితే రేపటి నుంచి ఈ నెల 12 వరకు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో వున్న మస్తాన్‌వలీని రేపు సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. మరో ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
తెలుగు అకాడమీ గోల్ మాల్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. యుబిఐ మేనేజర్ గా ఉన్న మస్తాన్ వలీ, సత్యనారాయణ, పద్మావతి, మొహియుద్దీన్ లను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read:తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న పోలీసులు
మాయమైన మొత్తాలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే విషయం తెలియడం లేదు. నిందితుల ఖాతాల్లో కూడా డబ్బులు లేవని తెలుస్తోంది. దీంతో ఆ నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే విషయాన్ని తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి దాదాపు ఐదున్నరేళ్లు అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన స్థానంలో సోమిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. సోమిరెడ్డిపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. నిధుల గోల్ మాల్ నేపథ్యంలో సోమిరెడ్డిపై వేటు పడింది. ఆయన స్థానంలో ఐఎఎస్ అధికారి దేవసేన (Devasena)కు అదనంగా తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవీబాధ్యతలు అప్పగించారు.
తెలుగు అకాడమీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డి (SomiReddy)కి, ఎసీవోకు సీసీఎస్ పోలీసులు ఇది వరకే నోటీసులు జారీచేశారు. తమ విచారణకు హాజరు కావాలని పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని కూడా సూచించారు. దీనిలో భాగంగా సోమవారం సోమిరెడ్డిని సీసీఎస్ పోలీసులు ప్రశ్నించారు.