తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న పోలీసులు

తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసు దర్యాప్తును సీసీఎస్ పోలీసులు ముమ్మరం చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

CCS police probing Telugu Akademi direcor Somi Reddy

హైదరాబాద్: నిధుల గోల్ మాల్ విషయంలో సీసీఎస్ పోలీసులు తెలుగు అకాడమీ తాజా మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. అలాగే అకాడమీ ఆర్థిక విభాగం అధికారులను కూడా ప్రశ్నిస్తున్నారు. తెలుగు అకాడమీ ఆకౌంట్స్ ఆఫీసర్ (ఎసీవో)గా రమేష్ వ్యవహరిస్తున్నారు. కాగా, మాజీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. 

తెలుగు అకాడమీ ఫిక్స్ డ్ డిపాజిట్లు మాయం వెనక పాత్రపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సోమిరెడ్డి కొన్ని డిపాడిట్లకు రిలీజింగ్ ఆర్డర్ ఇచ్చారు. అలాగే సత్యనారాయణ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కాలంలో కూడా కొన్ని రిలీజింగ్ ఆర్డర్లు జారీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని మొత్తాలు బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని తెలుస్తోంది. 

Also Read: తెలుగు అకాడమీలో నిధుల గోల్‌మాల్: మాజీ డైరెక్టర్‌ సోమిరెడ్డికి సీసీఎస్ నోటీసులు

తెలుగు అకాడమీ గోల్ మాల్ వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్టు చేశారు. యుబిఐ మేనేజర్ గా ఉన్న మస్తాన్ వలీ, సత్యనారాయణ, పద్మావతి, మొహియుద్దీన్ లను అరెస్టు చేశారు. మరో కీలక నిందితుడు రాజ్ కుమార్ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. అతని అరెస్టును చూపిస్తారని సమాచారం. 

మాయమైన మొత్తాలు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే విషయం తెలియడం లేదు. నిందితుల ఖాతాల్లో కూడా డబ్బులు లేవని తెలుస్తోంది. దీంతో ఆ నిధులు ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయనే విషయాన్ని తేల్చడానికి ప్రయత్నిస్తున్నారు. 

Also Read: తెలుగు అకాడమీలో ఔట్ సోర్సింగ్ బాగోతం: కోట్లాది రూపాయలు వృధా

సత్యనారాయణ రెడ్డి దాదాపు ఐదున్నరేళ్లు అకాడమీ డైరెక్టర్ గా ఉన్నారు. ఆయన స్థానంలో సోమిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నారు. సోమిరెడ్డిపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. నిధుల గోల్ మాల్ నేపథ్యంలో సోమిరెడ్డిపై వేటు పడింది. ఆయన స్థానంలో ఐఎఎస్ అధికారి దేవసేనకు అదనంగా తెలుగు అకాడమీ డైరెక్టర్ పదవీబాధ్యతలు అప్పగించారు. 

తెలుగు అకాడమీ డైరెక్టర్ మాజీ డైరెక్టర్ సోమిరెడ్డికి, ఎసీవోకు సీసీఎస్ పోలీసులు ఇది వరకే నోటీసులు జారీచేశారు. తమ విచారణకు హాజరు కావాలని పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలని కూడా సూచించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios