రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టిఆర్ఎస్ నేత సోదరుడు ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన దుబ్బాక సతీస్ రెడ్డి నార్కట్ పల్లి వద్ద సంఘటన

నల్లగొండ జిల్లాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో టిఆర్ఎస్ నేత సోదరుడు మృతి చెందాడు. హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. నల్లగొండ జిల్లా టిఆర్ఎస్ నేత దుబ్బాక నర్సింహ్మారెడ్డి సోదరుడు దుబ్బాక సతీష్ రెడ్డి శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి నల్లగొండ వెళ్తున్నాడు. ఈ క్రమంలో హై వే మీద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది సతీష్ రెడ్డి కారు. దీంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు.