చెరుకు సుధాకర్‌కు బెదిరింపులు: నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  పోలీసులు  కేసు నమోదు చేశారు.  బెదిరింపులపై  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  చెరుకు సుధాకర్  ఫిర్యాదు  చేశారు.

Nalgonda police files Case  Against  Bhuvanagiri MP Komatireddy Venkat Reddy

నల్గొండ:  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  పోలీసులు కేసు నమోదు  చేశారు. బెదిరింపులపై  చెరుకు సుధాకర్  , ఆయన  కొడుకు  సుహాస్  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.   ఈ ఫిర్యాదు  ఆదారంగా  పోలీసులు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై  ఐపీసీ  506 సెక్షన్ కింద  కేసు నమోదు చేశారు. 

టీపీసీసీ ఉపాధ్యక్షుడు  చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్  కు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఫోన్ చేసి  బెదిరింపులకు దిగాడు. తనపై విమర్శలు మానుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  వార్నింగ్  ఇచ్చారు.  తన అభిమానులు,  కార్యకర్తలు  చెరుకు సుధాకర్ ను చంపేందుకు  వంద కార్లలో తిరుగుతున్నారని  బెదిరించిన ఆడియో సంభాషణ  సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది.

ఈ ఆడియో సంభాషణపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి  వెంకట్ రెడ్డి  నిన్న వివరణ ఇచ్చారు. భావోద్వేగంతోనే తాను  ఈ వ్యాఖ్యలు  చేసినట్టుగా  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారు.  ఈ విషయానికి ఇప్పటితో  పుల్ స్టాప్ పెట్టాలని  ఆయన  చెరుకు సుధాకర్ ను కోరారు. తన కొడుకుకు ఫోన్  చేసి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  బెదిరింపులకు పాల్పడడంపై  కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘానికి  చెరుకు సుధాకర్ నిన్న ఫిర్యాదు చేశారు.

అంతేకాదు  రాష్ట్రానికి  చెందిన  కాంగ్రెస్ పార్టీ  నేతలకు చెరుకు సుధాకర్  లేఖ రాశారు. బెదిరింపులపై   చెరుకు సుధాకర్,  ఆయన కొడుకు సుహస్ లు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా  పోలీసులు  కేసు నమోదు  చేశారు.

also read:చెరుకు సుధాకర్‌ కు బెదిరింపులు: కోమటిరెడ్డిపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు

గత ఏడాదిలో  మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగాయి.ఈ ఉప ఎన్నికల సమయంలో  చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో  చేరారు.  తన పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన  నేత చెరుకు సుధాకర్ ను పార్టీలో  చేర్చుకొనే విషయమై  తనకు  సమాచారం  లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  తీరుపై ఆగ్రహం  వ్యక్తం చేశారు. 

2019 ఎన్నికల సమయంలో  తనను ఓడించేందుకు  చెరుకు సుధాకర్ ప్రయత్నించాడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  గతంలో ఆరోపణలు  చేసిన విషయం తెలిసిందే. మునుగోడు  అసెంబ్లీ  ఎన్నికల సమయంలో  చేసిన  వ్యాఖ్యలతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి    పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ షోకాజ్ లను  పార్టీ నాయకత్వం చెత్తబుట్టలో వేసిందని   ఇటీవలనే  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios