ఒకరితో ప్రేమ.. మరొకరితో పెళ్లి.. చివరికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన ప్రియుడు..
తన భర్తను విడిచిపెట్టి వస్తే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ వివాహిత రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది.

తన భర్తను విడిచిపెట్టి వస్తే.. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఓ వివాహిత రోడ్డుపై ధర్నా చేపట్టింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని వేములపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే వేములపల్లి మండలంలోని ఆమనగల్లు గ్రామానికి చెందిన మహేష్, అదే మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన తరిగొప్పుల శిరీష గత ఆరు సంవత్సరాలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.వారి ప్రేమ విషయం శిరీష ఇంట్లో తెలియడంతో ఆమె బంధువులు ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే శిరీష తల్లిదండ్రులు మరో వ్యక్తితో ఆమె వివాహం చేశారు. అంతా సర్దుకుంటుందిలే అని అందరూ భావించారు. కానీ శిరీష, మహేష్ ల ప్రేమ వ్యవహారం మాత్రం మరింత ముదిరింది. వారి తమ వ్యవహరాన్ని గట్టు చప్పడు కాకుండా సాగించారు.
ఈ క్రమంలో మహేష్ ..ఓ కండిషన్ పెట్టారు. తన భర్తకు విడాకులు ఇస్తే తాను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని శిరీష ను నమ్మించాడు. తన ప్రియుని మాటలను నమ్మిన శిరీష.. తన భర్తకు దూరంగానే ఉంటూ విడాకులు ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో మహేష్ శిరీష కు దిమ్మతిరిగే ట్రస్ట్ ఇచ్చాడు. తాను పెళ్లి చేసుకోనని కుండబద్దలు కొట్టాడు.
ఈ విషయమై శిరీష ఆ గ్రామ పెద్దలను ఆశ్రయించింది. తన భర్తకు విడాకులు ఇస్తే.. తనని పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని, నేడు తన భర్తను విడిచి వస్తే.. ముఖం చాటేస్తున్నాడని ఆరోపించింది. వాస్తవానికి శిరీష తన భర్తకు విడాకులు ఇవ్వలేదని, కేవలం దూరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు.