Asianet News TeluguAsianet News Telugu

హాజీపూర్ సీరియల్ రేపిస్ట్ కేసు: ఈ నెల 27 తుది తీర్పు

హాజీపూర్ సీరియల్ హత్యల కేసులో ఈ నెల 27వ తేదీన తుది తీర్పు వెలువర్చనుంది నల్గొండ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.

Nalgonda Fasttrack court will be  delivered final verdict on jan 27 over Hajipur case
Author
Hyderabad, First Published Jan 17, 2020, 2:17 PM IST


ఈ నెల 27వ తేదీన హాజీపూర్‌లో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో నల్గొండ పాస్ట్‌ట్రాక్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.

Also read:హాజీపూర్ కేసు: ఉరిశిక్ష విధించాలి, ముగిసిన ప్రాసిక్యూషన్ వాదనలు

ముగ్గురు మైనర్ బాలికలపై అత్యాచారం, హత్య కేసులో సుమారు గంటపాటు శుక్రవారంనాడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ కేసు విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.ఈ కేసు తుది తీర్పును 27న ఇవ్వనున్నట్టు పాస్ట్‌ట్రాక్ కోర్టు తేల్చి చెప్పింది.

Also Read:జాలి, దయ అక్కర్లేదు...హాజీపూర్ శ్రీనివాస్‌‌‌కి ఉరే సరి

15 రోజులుగా హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు విచారణ చేస్తోంది.  రెండు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి తన వాదనలను విన్పించారు.

Also Read:నాపై తప్పుడు కేసు పెట్టారు: హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డి

తాను అమాయకుడిని అంటూ శ్రీనివాస్ రెడ్డి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ముందు వివరించారు. అయితే శ్రీనివాస్ రెడ్డి వాదనను ప్రభుత్వ తరపు లాయర్ ఖండించారు. ఈ కేసులో పోలీసులు సేకరించిన శాస్త్రీయ ఆధారాలను కూడ ఇప్పటికే కోర్టుకు సమర్పించారు.

అయితే శ్రీనివాస్ రెడ్డిని తమకు అప్పగించాలని  మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఫాస్ట్ ట్రాక్‌ కోర్టు ఏ రకమైన తీర్పును వెల్లడించనుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios