జాలి, దయ అక్కర్లేదు...హాజీపూర్ శ్రీనివాస్‌కి ఉరే సరి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ వరుస హత్యల కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ వాదనలు సోమవారంతో ముగిశాయి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ వరుస హత్యల కేసుకు సంబంధించి ప్రాసిక్యూషన్ వాదనలు సోమవారంతో ముగిశాయి. నల్గొండలోని ఫోక్సో స్పెషల్ కోర్టులో ప్రాసిక్యూషన్ ముందు వాదనలు వినిపించిన బాధితుల తరపు న్యాయవాది ... నిందితుడు శ్రీనివాస్ రెడ్డి ఉరిశిక్షకు అన్ని విధాలుగా అర్హుడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
చిన్నారులపై దారుణంగా వ్యవహరించిన ఇతనిపై జాలి, దయ చూపాల్సిన అవసరం లేదన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం దీనిని అరుదైన కేసుగా పరిగణించాలని ఆయన న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు.
బాలికలతో పాటు మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు రుజువైందని న్యాయవాది గుర్తు చేశారు. కేవలం తన లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం హత్యలు చేస్తున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యక్తి సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని.. ఇది కేవలం ఒక కేసుగా చూడకూడదని, సమాజానికి పట్టిన రుగ్మతలా పరిగణించాలన్నారు.