నల్లగొండ జిల్లాలో 16 రోజులుగా కరోనా కేసులు లేవు: జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లాలో గత 16 రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు లేవని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట జిల్లా కోలుకోవడానికి మాత్రం కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.

Nalgonda district Coronaviru free in Telangana

నల్లగొండ: ఉమ్మడి నల్గొండ జిల్లాను కరోనా రహిత జిల్లాగా మలిచేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.నల్గొండ జిల్లాలో గడిచిన 16 రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడమే ఇందుకు తార్కాణమని ఆయన స్పష్టం చేశారు.

శనివారం ఉదయం నల్గొండ పట్టణంలో రెడ్ జోన్ ఏరియగా పేర్కొన్న మీర్ బాగ్ కాలనిలో మంత్రి జగదీష్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు.అక్కడి ప్రజల సాధక బాధకాలు తెలుసుకున్న ఆయన అనంతరం మీడియా తో మాట్లాడారు.నల్గొండలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నాయని రెడ్ జోన్ ల ఎత్తివేత కు రంగం సిద్ధం అయిందని ఆయన వెల్లడించారు.

కరోనా కట్టడిలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు.అయితే సూర్యాపేట లో మరికొంత కాలం రెడ్ జోన్ ప్రాంతాలు కొనసాగుతాయని ఆయన ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకే అధికార యంత్రాంగం నిర్ణయాలు ఉంటాయని మంత్రి జగదీష్ రెడ్డి తేల్చి చెప్పారు.

కరోనా వైరస్ సోకి బయటకు చెప్పుకోలేక పోతున్న వారిని గుర్తించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగిందని ఆయన పేర్కొన్నారు.అందులో భాగంగానే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. అందులో పాజిటివ్ లుగా తేలితే తక్షణమే వారిని ఐసోలేషన్ కు పంపేందుకు అధికార యంత్రాంగం సిద్దంగా ఉందన్నారు.

యింకా ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,స్థానిక శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రస్తావిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే రికార్డ్ సృష్టించిందని మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చలువతోటే ఈ ఘనత సాధించామని ఆయన తేల్చిచెప్పారు.

నల్గొండలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 70%శాతం కొనుగోళ్లు జరిగాయాన్నారు.మొత్తం 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిపిన జిల్లాగా ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్ర కెక్కిందన్నారు.వ్యవసాయ శాఖ చరిత్రలోనే యాసంగి పంట కొనుగోళ్లు రికార్డ్ సృష్టింఛాయాన్నారు.

కళ్ళాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసిన చరిత్ర కూడా ఈ యాసంగి పంటతోనే నమోదు అయిందాన్నారు.అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతాంగం పట్ల ఉన్న దార్శనికతకు నిదర్శనమని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios