నల్లగొండ పోలీస్ అన్నదాతపై ఎలా రెచ్చిపోయిండంటే ? (వీడియో)

First Published 18, Apr 2018, 1:47 PM IST
Nalgonda cop uses abusive language on farmer
Highlights

ఏం చేసిండో చూడండి

అన్నదాత అంటే  పోలీసాయనకు ఎంత అలుసో. రైతులను ఈగలు, దోమల కంటే హీనంగా తీసిపారేసిండు ఈ పోలీసు సార్. పోలీసు నని అహంకారమో లేక రైతులంటే కోపమో తెలవదు కానీ.. వాళ్లపై బూతులతో విరుచుకుపడ్డాడు. గలీజు భాషలో రెచ్చిపోయి తిట్టిండు ఈ పోలీసు కానిస్టేబుల్. రైతుపై దాడి కూడా చేసి తన క్రౌర్యాన్ని ప్రదర్శించిండు.

ఇదంతా ఎక్కడ జరిగిందంటే.. ? నల్లగొండ జిల్లాలోని మాడ్గులపల్లి మండలంలో ఐకెపి సెంటర్ లో రైతును పట్టుకుని పోలీసు బండబూతులు తిట్టిండు. చుట్టుముట్టు ఉన్న రైతులు వారిస్తున్నా.. ఈ పోలీసాయన మాత్రం బూతులు ఆపలేదు. రెచ్చిపోయి తిట్టిండు. ఆయన ఎలా తిట్టిండో పైన వీడియో ఉంది చూడండి.
అన్నదాతపై పోలీసు కానిస్టేబుల్ నోరు పారేసుకున్న ఘటనపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే పోలీసుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

loader