Asianet News TeluguAsianet News Telugu

పార్టీ మార్పుపై వార్తలు .. దుష్ప్రచారం : కాసేపట్లో కీలక ప్రకటన చేయనున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి

టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ  గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కాసేపట్లో కీలక ప్రకటన జారీ చేయనున్నారు. 

nalgonda congress mp uttam kumar reddy to gave clarity on rumours about party changing news soon ksp
Author
First Published Jul 29, 2023, 5:43 PM IST

టీపీసీసీ మాజీ చీఫ్ , నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారుతారంటూ  గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఉత్తమ్ పలుమార్లు మీడియా ముఖంగా ఖండించినా ఈ దుష్ప్రచారం మాత్రం ఆగడం లేదు. ఇక ఇటీవల ఉత్తమ్ తన సతీమణి పద్మావతి, అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లోకి చేరుతారంటూ ప్రచారం జరిగింది. ఇది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ స్పందించారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ఆయన కీలక ప్రకటన చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios