హమ్మయ్య.. నల్లగొండ సిఐ డ్యూటికెక్కిండు (వీడియో)

హమ్మయ్య.. నల్లగొండ సిఐ డ్యూటికెక్కిండు (వీడియో)

హమ్మయ్య అని పోలీసు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే నల్లగొండ టూటౌన్ సిఐ వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు కూడా ఊపిరిపీల్చుకున్నారు. ఎందుకంటే చెప్పా పెట్టకుండా మాయమై గుంటూరు జిల్లాలో తేలిండు సిఐ వెంకటేశ్వర్లు. అంతేకాదు.. ఆయన తన సర్వీసు రివాల్వర్ ను, సిమ్ కార్డును రిటర్న్ చేసి పోయిండు. సొంత ఫోన్ స్విచ్చాఫ్ చేసిండు. ఏమైనా జరగరానిది జరుగుతదా అని ఇటు పోలీసులు అటు ఆయన కుటుంబసభ్యులు భయాందోళనలకు గురయ్యారు. కానీ.. 34 గంటల నిరీక్షణకు తెర దించుతూ సిఐ తిరిగి రావడమే కాదు.. కొద్దిసేపటి క్రితమే డ్యూటీ ఎక్కిండు.

ఉన్నతాధికారుల వేధింపులు ఒకవైపు.. రాజకీయ వత్తిళ్లు ఇంకోవైపు రావడంతో సిఐ ఉక్కిరిబిక్కిరి అయిండు. తట్టుకోలేక గుంటూరు సూర్యలంక వెళ్లి రిలాక్స్ అయిండు. జాడ కనుక్కుని నల్లగొండ పోలీసులు పట్టుకొచ్చిర్రు. తుదకు తిరిగి డ్యూటీలో చేరిపోయిండు వెంకటేశ్వర్లు. దీంతో సిఐ మిస్సింగ్ కేసు పరిసమాప్తమైపోయింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఛైర్ పర్సన్ లక్ష్మి భర్త హత్య కేసు ఇంకా ఇదే సిఐ మెడకు వేలాడుతూనే ఉండడం గమనార్హం.

అయితే సిఐ మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి రాజకీయ వత్తిళ్లు లేవని ప్రకటించారు. రిలాక్స్ కోసమే తాను సూర్యలంక వెళ్లినట్లు చెప్పుకొచ్చారు. సిఐ తిరిగి విధుల్లో చేరిన వీడియో కింద చూడొచ్చు. ఆయన ఏమన్నారో కూడా చూడండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos