ఈ నాగర్ కర్నూల్ పోలీసు ఏం చేసిండో తెలుసా (వీడియో)

nagarkurnool police misbehaves public
Highlights

  • తప్పతాగి రోడ్డుపై చిందులు
  • బూతులు తిట్టడంతో స్థానికుల దాడి
  • ఒల్లు మరచి రోడ్లపై తిరిగిన పోలీస్

పోలీసా మజాకా అంటే ఏందో తెలుసా? ఈ నాగర్ కర్నూలు పోలీసు చేసిన పని చూస్తే అందరూ ఔరా అని ముక్కు మీద వేలేసుకుంటారు. జిల్లా కేంద్రంలో పనిచేసే ఈ పోలీసాయన ఫుల్లుగా మందు కొట్టిండు. రోడ్డు మీద హల్ చల్ చేసిండు. న్యూ ఇయర్ వేడుకలు పోలీసులు జరుపుకుంటే ఎలా ఉంటుందో నాగర్ కర్నూలు జనాలకు రుచి చూపించిండు. 

నాగర్ కర్నూల్ జిల్లా కెంద్రంలో తప్పతాగి  కానిస్టేబుల్ హల్ చల్ సృష్టించాడు అడ్డుపడి వాహనదారులను బూతులు తిట్టడంతో ఆగ్రహించిన కొందరు కానిస్టేబుల్ కి దేహశుద్ది చేసారు. తాగుడు ఎక్కుపైన సదరు కానిస్టేబుల్ రోడ్డు మీద అడ్డంగా పడిపోయాడు. ఈ పోలీసు తీరు గురించి రెండు వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

 

స్థానికులు కొందరు దయ తలిచి రోడ్డు మీద పడి ఉన్న కానిస్టేబుల్ ను రోడ్డు పక్కకు పట్టుకుపోయి కూర్చోబెట్టారు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. వీడియో కింద ఉంది చూడండి.

loader