కాంగ్రెస్ కు షాక్: రాజీనామా చేసిన నాగం జనార్థన్ రెడ్డి, బీఆర్ఎస్‌లోకి
కాంగ్రెస్ కు మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి ఇవాళ రాజీనామా చేశారు. నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ కు మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి ఆదివారంనాడు రాజీనామా చేశారు. నాగం జనార్థన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇవాళ సాయంత్రం నాగం జనార్ధన్ రెడ్డి ఇంటికి తెలంగాణ మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. బీఆర్ఎస్ లో చేరాలని నాగం జనార్థన్ రెడ్డిని కేటీఆర్ ఆహ్వానించనున్నారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టును నాగం జనార్ధన్ రెడ్డి ఆశించారు.
కానీ ఈ స్థానం నుండి నాగం జనార్థన్ రెడ్డికి కాకుండా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్టు కేటాయించింది. దీంతో అసంతృప్తిగా ఉన్న నాగం జనార్థన్ రెడ్డి కాంగ్రెస్ కు ఇవాళ రాజీనామా చేశారు.
కాంగ్రెస్ టిక్కెట్టు దక్కకపోవడంతో నాగం జనార్థన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన అనుచరులతో రెండు మూడు దఫాలు నాగం జనార్థన్ రెడ్డి సమావేశమయ్యారు. బీఆర్ఎస్ లో చేరాలని నాగం జనార్థన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
also read:టిక్కెట్టు నిరాకరణ: అనుచరులతో నాగం జనార్థన్ రెడ్డి భేటీ
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పలు దఫాలు టీడీపీ అభ్యర్ధిగా, ఒక్కసారి ఇండిపెండెంట్ గా నాగం జనార్థన్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికలకు ముందు నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఈ ఒక్కసారి నాగర్ కర్నూల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని భావించారు. అయితే పార్టీ నాయకత్వం మాత్రం నాగం జనార్ధన్ రెడ్డికి మాత్రం టిక్కెట్టు ఇవ్వలేదు.మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రాజేష్ రెడ్డికే కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కేటాయించింది. నాగర్ కర్నూల్ టిక్కెట్టు తనకు దక్కుండా చేయడంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవహరించారని నాగం జనార్ధన్ రెడ్డి రగిలిపోతున్నారు.సర్వే రిపోర్టులను మార్చి తనకు టిక్కెట్టు దక్కకుండా చేశారని నాగం జనార్ధన్ రెడ్డి ఆరోపణలు చేశారు. నాగం జనార్ధన్ రెడ్డికే టిక్కెట్టు కేటాయించాలని ఆయన అనుచరులు రెండు వారాల క్రితం గాంధీభవన్ లో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.