టిక్కెట్టు నిరాకరణ: అనుచరులతో నాగం జనార్థన్ రెడ్డి భేటీ

కాంగ్రెస్ టిక్కెట్టు దక్కకపోవడంతో  హైద్రాబాద్ లో అనుచరులతో మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి సమావేశమయ్యారు.

Former Minister Nagam Janardhan Reddy meeting with his followers lns


హైదరాబాద్: కాంగ్రెస్ టిక్కెట్టు దక్కకపోవడంతో  హైద్రాబాద్ లో  అనుచరులతో  మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి  ఆదివారం నాడు  సమావేశమయ్యారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్టును నాగం జనార్థన్ రెడ్డి ఆశించారు. కానీ  ఇవాళ కాంగ్రెస్ ప్రకటించిన  తొలి జాబితాలో నాగం జనార్థన్ రెడ్డికి టిక్కెట్టు దక్కలేదు. రెండు రోజుల క్రితమే గాంధీ భవన్ లో  టిక్కెట్టు కేటాయించాలని  నాగం జనార్థన్ రెడ్డి అనుచరులు  ఆందోళన నిర్వహించారు. ఇటీవలే పార్టీలో చేరిన  కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ  టిక్కెట్టు కేటాయించింది. వారం రోజుల క్రితం  నాగర్ కర్నూల్ లో  నాగం జనార్థన్ రెడ్డి అనుచరులతో  ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.

ఈ ఒక్క దఫా నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని నాగం జనార్థన్ రెడ్డి  కూచుకుళ్ల కుటుంబాన్ని కోరినట్టుగా సమాచారం. వచ్చే ఎన్నికల్లో తాను  పోటీ చేయబోనని  కూడ  నాగం జనార్థన్ రెడ్డి  చెప్పారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.కాంగ్రెస్ టిక్కెట్టు దక్కుతుందని నాగం జనార్థన్ రెడ్డి  వారం రోజుల క్రితం వరకు ధీమాగా ఉన్నారు. అయితే  ఆ తర్వాత నుండి టిక్కెట్టు దక్కదనే అనుమానం మొదలైందనే ప్రచారం ఆయన వర్గీయుల్లో ఉంది. 

కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో  నాగం జనార్థన్ రెడ్డి పేరు లేదు. దీంతో  ఇవాళ నాగర్ కర్నూల్ నుండి  అనుచరులను జనార్ధన్ రెడ్డి  హైద్రాబాద్ పిలిపించుకున్నారు.  భవిష్యత్తు కార్యాచరణపై  నాగం జనార్థన్ రెడ్డి చర్చించనున్నారు. 

also read:12 మంది వలస నేతలకు కాంగ్రెస్ టిక్కెట్లు:నాగం, మర్రికి నిరాశే

2014 ఎన్నికలకు ముందు  నాగం జనార్థన్ రెడ్డి బీజేపీలో చేరారు.  ఆ తర్వాత కొంత కాలానికి ఆయన  ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూచుకుళ్ల దామోదర్ రెడ్డి తనయుడు  కాంగ్రెస్ లో చేరడంతో  నాగం జనార్థన్ రెడ్డి  టిక్కెట్టు దక్కలేదు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా , ఒక్క దఫా  ఇండిపెండెంట్ గా నాగం జనార్థన్ రెడ్డి విజయం సాధించారు.  గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా  బరిలో దిగిన ఆయనకు విజయం దక్కలేదు.  ఈ దఫా కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్టు కేటాయించలేదు.  కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వకపోవడంతో నాగం జనార్థన్ రెడ్డి  భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుందోననే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios