Asianet News TeluguAsianet News Telugu

నాగశౌర్య ఫాంహౌజ్ కేసు : చుట్టూ బాడీగార్డులు.. టేబుల్ కు 5 లక్షలు, ప్రముఖులతో వాట్సాప్ గ్రూపులు...

పట్టుబడిన 30 మందిని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.  న్యాయస్థానం వీరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం తోపాటు.. ఈ నెల 15 వరకు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Naga Shaurya s farm house gambling case details
Author
Hyderabad, First Published Nov 2, 2021, 9:53 AM IST

హైదరాబాద్ :  నగర శివారులోని మంచిరేవుల ఫామ్ హౌస్ లో ఆదివారం రాత్రి పేకాట ఆడుతూ పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే సహా బడా స్థిరాస్తి వ్యాపారులు, ఇతర రంగాల్లోని ప్రముఖులను ఉండటంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.  

పట్టుబడిన 30 మందిని నార్సింగి పోలీసులు సోమవారం కోర్టులో హాజరుపరిచారు.  న్యాయస్థానం వీరి బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం తోపాటు.. ఈ నెల 15 వరకు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

టాలీవుడ్ హీరో Naga Shourya తండ్రి తను.. ఈ Farmhouseను దాని యజమాని (ఓ మాజీ ఉన్నతాధికారి) నుంచి ఐదేళ్లకు అద్దెకు తీసుకున్నారు.  సదరు Lease documentsతో హాజరుకావాలని పోలీసులు సూచించగా ఆయన రాలేదు. ఈ వ్యవహారంలో మణికొండ కు చెందిన గుత్తా సుమన్ కుమార్ ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. 

ఈ నేపథ్యంలో Gutta Suman Kumar, నాగశౌర్య మధ్య సంబంధాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. ఏపీ ఇంటిలిజెన్స్ పోలీసులు కేసు వివరాలు తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

 తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు…
 విజయవాడకు చెందిన Gutta Suman Kumar పై ఏపీ తెలంగాణలోని వివిధ ఠాణాల్లో పలు కేసులు నమోదైనట్లు నార్సింగి పోలీసులు ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. ఆగస్టు 15న  గచ్చిబౌలి ఠాణా పరిధిలోని  ఓ అపార్ట్మెంట్ లో Poker ఆడుతూ సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లు కూడా గుర్తించారు.

‘సుమన్ కుమార్  చుట్టూ  బాడీగార్డులను పెట్టుకుని ప్రముఖుడిగా చలామణి అవుతూ ఉంటాడు.  పెద్ద వాళ్ళతో పరిచయం ఉందని చెబుతూ ఎందరినో మోసం చేశాడు. భూ కబ్జాలకు పాల్పడినట్లు  గుర్తించాం.  మామిడి తోటల్లో పేకాట శిబిరాలు నిర్వహించే స్థాయి నుంచి ఫామ్హౌస్లో, స్టార్ హోటళ్లు, అపార్ట్మెంట్లలో గదులను అద్దెకు తీసుకుని ప్రత్యేక క్యాంపులను (క్యాసినో) ఏర్పాటు చేసే స్థాయికి వచ్చాడు. 

తెలుగు రాష్ట్రాల్లో ని ప్రముఖులతో వాట్స్అప్ గ్రూపులు ఏర్పాటు చేశాడు. Real estate businessలోనూ అడుగుపెట్టాడు. ఓ న్యూస్ ఛానెల్కు డైరెక్టర్ గా పనిచేశాడు. ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి భారీగా మోసాలకు పాల్పడ్డాడు’ అని ఓ పోలీస్ అధికారి తెలిపారు. మరో గంట వేచి ఉంటే ఫాంహౌస్లో పేకాట ఆడేందుకు మరికొందరు ప్రముఖులు వచ్చేవారు అన్నారు.

హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాట: రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు

కీలకంగా ఫోన్లోని సమాచారం

ఈ కేసులో సుమన్ ఫోన్ కీలకంగా మారింది.  తెలుగు రాష్ట్రాల్లో ని పలువురు ఎమ్మెల్యేలు ఇతర ప్రముఖులతో జరిపిన సంభాషణలు అందులో ఉన్నట్లు తెలుసుకున్న దర్యాప్తు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నిర్ణయించిన నార్సింగి పోలీసులు  మంగళవారం పిటిషన్ దాఖలు చేయనున్నారు.

అరెస్ట్ అయ్యింది వీరే…
గుత్తా సుమన్ కుమార్,  శ్రీరామ్ భద్రయ్య ( మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే),  తనున్,  గుమ్మడి రామస్వామిచౌదరి,  నంది గా ఉదయ్,  సిహెచ్ శ్రీనివాసరావు, టి శివరామకృష్ణ, బడిగా సుబ్రమణ్యం,  పాండిటాగా నరేష్,   నాగార్జున,  కే వెంకటేష్,  ఏం భాను ప్రకాష్,  పాతూరి తిరుమల,  వీర్ల శ్రీకాంత్,  మద్దుల ప్రకాష్,  సీవీసీ రాజారాం,  కె. మల్లికార్జున రెడ్డి, బొగ్గారాపూర్ నాగా, ఘట్ట వెంకటేశ్వరరావు, ఎస్ఎస్ఎన్ రాజు,  యు గోపాల్ రావు,  బి రమేష్ కుమార్,  కంపల్లి శ్రీనివాస్,  ఇమ్రాన్ ఖాన్,  రోహిత్,  బొళ్లబోలా ఆదిత్య,  సిహెచ్ గణేష్,  తోట ఆనంద్ కిషోర్,  షేక్ ఖాదర్,  బి రాజేశ్వర్. 

టేబుల్ కు ఐదు లక్షలు
రాష్ట్రంలో పేకాట కేంద్రాలను సీఎం కేసీఆర్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే మూసివేయించారు. పేకాట ఎక్కడ ఆడినా.. ఆడించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ అనేక పేకాట క్లబ్బులను మూసివేయించి, కఠిన చర్యలు చేపట్టింది. కానీ కొంతమంది పేకాటను  చీకటి వ్యవహారంగా నడిపిస్తూ కోట్లు గడిస్తున్నారు.

రక రకాల ఆఫర్లు చెప్పి,  పండుగల స్పెషల్ అంటూ  మూడుముక్కలాట కు అన్ని హంగులున్న సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.  సైబరాబాద్ లో పట్టుబడిన  సుమన్ గ్యాంగ్  కేవలం ఒక చిన్న చేప మాత్రమే అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పేకాట నడిపిస్తున్న మరో మాఫియా మూడు ముక్కలు.. 6 కోట్లు అన్నట్లుగా భారీ స్థాయిలో జూదం నడిపిస్తోంది.

సుమన్ స్పెషల్ పేరిట..
జి సుమన్ కుమార్ (జీఎస్కే)  నగరంతోపాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంతమంది వ్యాపారులు, ప్రముఖులకు వాట్స్అప్ ద్వారా పండుగల శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలు పెడుతున్నామని సందేశాలు పంపిస్తాడు.  పార్టీ లొకేషన్ షేర్ చేస్తాడు.  ఫామ్ హౌస్,  గెస్ట్ హౌస్ లు  కిరాయికి తీసుకొని  మందు, విందు  భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తాడు.  కనీసం 5 నుంచి 10 టేబుల్ పెట్టి ప్రముఖులకు ఏర్పాటు చేస్తాడు.

అయితే స్పెషల్ ఎట్రాక్షన్ కోసం గోవా డీలర్ల నుంచి సుమన్ క్యాసినో గర్ల్స్ ను రంగంలోకి దించినట్లు సైబరాబాద్ పోలీసులు విచారణలో వెల్లడైంది.  సుమన్ ఆహ్వానం కోసం వీవీఐపీలంతా ఎదురు చూస్తారని విచారణలో తెలిసింది. హైదరాబాద్ లోనే కాకుండా విఐపిలను ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, గోవా తీసుకెళ్లి కూడా జూదం ఆడిస్తాడని తెలిసింది. రెండు నెలల క్రితం సుమన్ కొంతమంది వ్యాపారులు వీఐపీలతో కలిసి రూ. 4.5 కోట్ల వ్యాపారం జరిపించినట్లు రష్యా వెళ్లి వచ్చిన ఓ వ్యాపారి ద్వారా వెల్లడైంది. 

Follow Us:
Download App:
  • android
  • ios