'కాళేశ్వరంపై మాకు మొదటి నుండి అనుమానాలున్నాయి': మేడిగడ్డను పరిశీలించిన మంత్రులు

మేడిగడ్డ బ్యారేజీని  మంత్రులు  ఇవాళ పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రులకు నీటిపారుదల శాఖాధికారులు  పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చారు.

N.Uttam Kumar Reddy along other ministers visited  medigadda barrage lns

మహదేవ్ పూర్: కాళేశ్వరం ప్రారంభించినప్పటి నుండే అనుమానాలున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ప్రాంతాన్ని  మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు  శుక్రవారం నాడు  పరిశీలించారు.  హైద్రాబాద్ నుండి హెలికాప్టర్ లో మంత్రులు  మేడిగడ్డకు చేరుకున్నారు. హెలికాప్టర్ లో  మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని మంత్రులు ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత  ప్రాజెక్టు పిల్లర్లు కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుపై  నీటి పారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్  మురళీధర్ రావు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.  ఈ ప్రాజెక్టుపై తమ సందేహాల గురించి మంత్రులు ఈఎన్‌సీ మురళీధర్ రావును  అడిగారు.

also read:బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం కష్టాలు: మేడిగడ్డ ముంచుతుందా, తేల్చుతుందా?

మేడిగడ్డ బ్యారేజీ కుంగడం బాధాకరమణి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  అన్నారు. మేడిగడ్డ కుంగినప్పటినుండి ఇప్పటివరకు కేసీఆర్ స్పందించని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయమై  న్యాయ విచారణ జరుపుతామని  శాసనసభలోనే ప్రకటించినట్టుగా  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు. కాళేశ్వరం కంటే ప్రాణహితే ఉత్తమమైందన్నారు.మహారాష్ట్ర కొంత ముంపుతో ప్రాణహిత పూర్తయ్యేదని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రాజెక్టు వ్యయాన్ని  80 వేల కోట్ల నుండి లక్షన్నర కోట్లకు పెంచారని ఆయన విమర్శించారు.కాళేశ్వరం కింద కొత్త ఆయకట్టుకు  రూ. 90 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు.మేడిగడ్డ కుంగడమే కాదు, అన్నారం బ్యారేజీ కూడ డ్యామేజీ అయిందని మంత్రి తెలిపారు. ఇంకా సుందిళ్లను పరిశీలించాల్సి ఉందన్నారు.

 ఇంజనీర్ల సలహాలు కేసీఆర్ తీసుకున్నారా అని మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ప్రశ్నించారు. కేసీఆరే చీఫ్ ఇంజనీర్ గా పనిచేశారా అని ఆయన అడిగారు. ఈ బ్యారేజీలో మూడో టీఎంసీ అవసరం లేదన్నారు.మూడో టీఎంసీ కేసీఆర్ బంధువు కోసం చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
ఇంజనీర్లు సలహాలు ఇవ్వాలన్నారు. సలహాలను  ప్రభుత్వం వినకపోతే  సెలవు పెట్టి పోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
కొండ పోచమ్మ ఎప్పుడూ నిండుగా ఉంటుందన్నారు.  కేసీఆర్ ఫాం హౌస్ కు  తప్ప ఇతర పొలాలకు  నీరు పోదని ఆయన విమర్శించారు. ఇంత ఖర్చు చేసినా ఎంత ఆయకట్టుకు నీరు వెళ్తుందని కోమటిరెడ్డి ప్రశ్నించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios