టిఆర్ఎస్ ముత్తిరెడ్డి, శంకర్ నాయక్ గెలిచారు

టిఆర్ఎస్ ముత్తిరెడ్డి, శంకర్ నాయక్ గెలిచారు

తెలంగాణలో ఇద్దరు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రాతి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నారు. వారిద్దరూ ఉమ్మడి వరంగల్ జిల్లా వారే. వారిలో ఒకరు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అయితే.. ఇంకొకరు శంకర్ నాయక్. వీరిద్దరూ తీవ్ర విమర్శల పాలయ్యారు. వీరి అవినీతి అక్రమాలను స్వయంగా ఆయా జిల్లాల కలెక్టర్లే బయట పెట్టడం తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ కబ్జాలను జనగామ కలెక్టర్ గా ఉన్న శ్రీ దేవసేన బయట పెట్టారు. ఎమ్మెల్యే కబ్జాలను తానే రంగంలోకి దిగి అడ్డుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, తన చేయి పట్టుకున్నారని మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా ఆరోపించారు. దీనిపైనా పెద్ద దుమారమే రేగింది. 

తాజాగా తెలంగాణ సర్కారు భారీగా ఐఎఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. 29 మంది బదిలీ అయ్యారు. అందులో ఈ వివాదాల్లో ఉన్న ఇద్దరు కలెక్టరమ్మలను బదిలీ చేశారు. మహబూబాబాద్ నుంచి ప్రీతిమీనాను తప్పించి ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీకి బదిలీ చేశారు. అలాగే జనగామ కలెక్టర్ గా ఉన్న శ్రీ దేవసేనను పెద్దపల్లి కలెక్టర్ గా బదిలీ చేశారు.  జనగామ కలెక్టర్ గా అనితా రామచంద్రన్ కు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. అలాగే మహబూబాబాద్ కలెక్టర్ స్థానంలో లోకేష్ కుమార్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. 

- రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా

- ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా

- రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి

- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు

- పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్

- బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు

- కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిత్తల్

- విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్

- పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా

- బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర

- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు

- గిరిజిన సంక్షేమ కమిషనర్‌గా క్రిస్టినా

- ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్

- భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ

- రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి

- సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్

- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనా

- వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఒమర్ జలీల్

- నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు

- పెద్దపల్లి కలెక్టర్‌గా దేవసేన

- జనగాం కలెక్టర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు

- మెదక్ కలెక్టర్‌గా మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు

- మహబూబాబాద్ కలెక్టర్‌గా లోకేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతులు

- ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు

- ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్

- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డీగా కాళీచరణ్

- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా భారతి హోళికేరి

- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సిక్బా పట్నాయక్

- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ముషారఫ్ అలీ

- బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి

- మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్

- భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి

- బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos