కొండాపూర్ యువతిపై అమానుషం.. గాయత్రి తల్లి, సోదరిపై కేసు నమోదు.. ఆస్తికోసం రచ్చకెక్కిన కుటుంబసభ్యులు..

కొండాపూర్ లో యువతిపై లైంగికదాడి చేయించిన గాయత్రి కేసులో.. ఆస్తి వివాదాలు బయటపడుతున్నాయి. కుటుంబసభ్యుల మధ్య ఆస్తి గొడవల్లో భాగంగా.. గాయత్రి భర్త ఆమె తల్లి, సోదరిపై కేసు పెట్టాడు. 

Murky Facts Come To Light in Kondapur Woman Assault Case

హైదరాబాద్ :  భర్తతో సన్నిహితంగా మెలుగుతున్న యువతిపై దారుణానికి తెగించిన గాయత్రి కేసులో పలు కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఆస్తి పంపకాలలో నెలకొన్న వివాదాలతో కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటున్నారు. ఆదివారం గాయత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా ఆమె భర్త శ్రీకాంత్ ఇచ్చిన ఫిర్యాదుతో నలుగురు కుటుంబ సభ్యులపై కేసు పెట్టారు.

కొండాపూర్ శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన దంపతులు రత్నరాజు, కృష్ణవేణి. కూతుళ్లు సౌజన్య, గాయత్రి. కుమారుడు ప్రదీప్ రాజు. సైన్యంలో పనిచేసిన రత్నరాజు గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. చిన్న కూతురు గాయత్రి 2009లో ప్రేమ వివాహం చేసుకుని కుటుంబానికి దూరంగా వెళ్ళింది. ఆ తరువాత భర్త నుంచి విడిపోయిన ఆమె శ్రీకాంత్ ను పెళ్లి చేసుకుంది. ఆస్తి పంపకాలలో తలెత్తిన గొడవలతో రత్న రాజు, కృష్ణవేణి మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. తనను వేధిస్తున్నాడంటూ భర్తపై కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

శ్రీ రామ్ నగర్ కాలనీ బీ బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 215 పార్ట్, 216, 217, 218, 229, 230 పార్ట్ లోని ఇంట్లో గాయత్రి తన భర్త శ్రీకాంత్ తో గత కొంత కాలంగా నివాసముంటుంది. రత్నరాజు చిన్న కూతురు దగ్గర ఉంటున్నాడు. 2015లో రత్నరాజు మరణించాక గొడవలు మరింత ముదిరాయి. గాయత్రి ఉన్న ఫ్లాట్ లోకి కృష్ణవేణి, సౌజన్య  అక్రమంగా ప్రవేశించారంటూ గతంలో కేసు నమోదైంది.  కుటుంబంలో తగాదాలు జరుగుతున్న సమయంలోనే  సివిల్స్ పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీకాంత్ కు ఆంధ్రాకు చెందిన యువతి దగ్గరైంది.

భర్త ఆ యువతితో సన్నిహితంగా ఉండటాన్ని భరించలేని గాయత్రీ ఐదుగురు యువకులను లైంగిక దాడికి పురిగొల్పింది. ఆ కేసులో గాయత్రి జైలుకు వెళ్లడంతో.. తల్లి కృష్ణవేణి, సోదరి సౌజన్య, సోదరుడు ప్రదీప్ రాజు, బాబాయ్ మల్లికార్జున్ ఆదివారం కొండాపూర్లోని శ్రీరాంనగర్ లోని ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.  శ్రీకాంత్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయగా నలుగురిపై కేసు నమోదు చేశారు. ప్లాట్, దుకాణాల్లోకి అక్రమంగా ప్రవేశించిన విషయంలో సౌజన్యపై గతంలో రెండు కేసులు ఉన్నట్లు గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ సురేష్ తెలిపారు. 

అసలేం జరిగిందంటే…
గాయత్రి కొండాపూర్లోని శ్రీనివాస్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంది. తన భాగస్వామితో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న ఓ యువతిపై ఐదుగురు వ్యక్తులతో కలిసి లైంగిక దాడి చేయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాయత్రి భాగస్వామి శ్రీకాంత్ సివిల్ కోచింగ్ సమయంలో బాధితురాలినిి కలిశాడు. గాయత్రి తరచుగా అనారోగ్యం పాలవుతుండడంతో ఆమెతో కలిసి ఉండాల్సిందిగా బాధితురాలిని కోరాడు. బాధితురాలు అక్టోబర్ 2021 నుంచి ఫిబ్రవరి 22వరకు గాయత్రితో పాటు వెళ్ళింది.

అయితే,  శ్రీకాంత్, బాధితురాలి మధ్య అనుబంధం ఉందని అనుమానించింది. ప్రణాళిక ప్రకారం ఐదుగురు వ్యక్తులను గాయత్రి ఇంట్లోని గదిలో నుంచి బాధితురాలిని అక్కడికి తీసుకు వెళ్ళింది. ఆ తర్వాత బాధితురాలిపై అత్యాచారం చేయించి ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసింది. పోలీసుల వద్దకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలిని గాయత్రి బెదిరించింది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios