తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులలో ఒకరైన రాఘవేంద్ర రాజు స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులలో ఒకరైన రాఘవేంద్ర రాజు స్టేట్‌మెంట్‌లో కీలక విషయాలు వెల్లడించినట్టుగా తెలుస్తోంది. ‘శ్రీనివాస్ గౌడ్ 2017 నుంచి చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నన్ను, నా కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్ గౌడ్‌ను చంపాలని అనుకున్నాను. నాకు శ్రీనివాస్ గౌడ్ నుంచి ప్రాణ భయం ఉంది. నాపై 30 కేసులు పెట్టించారు. నా బార్ షాప్‌ను మూసేయించి ఇబ్బంది పెట్టారు. ఆర్థికంగా కూడా నాకు నష్టం చేయించారు. ఒకే రోజు 10 కేసులు పెట్టించారు. ఆర్థికంగా రూ. 6 కోట్ల నష్టం చేకూర్చారు. నాకు రావాల్సిన డబ్బులు రాకుడా అడ్డుకున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా పెట్టి వేధించారు’ అని రాఘవేంద్ర రాజు చెప్పినట్టుగా సమాచారం.
మరోవైపు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిన్న నలుగురిని రిమాండ్‌కు పంపింన పేట్‌బషీరాబాద్ పోలీసులు ఇవాళ.. రాఘవేంద్రరాజు, అమరేంద్రరాజు, రవి, మధుసూదన్‌ను రిమాండ్‌కు పంపించారు. కుట్రకు వెనక అసలు కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా 5 కోట్ల రూపాయల సుపారీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు పోలీసులు యత్నిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు పోలీసులు నేడు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. జితేందర్ రెడ్డి డ్రైవర్‌ను, పీఏను ప్రశ్నించేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. మంత్రి హత్య చేయాలనే కుట్ర చేసిన నిందితులకు జితేందర్ రెడ్డి పీఏ, డ్రైవర్ ఆశ్రయమిచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు.
ఇక, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా దుమారం రేగింది. ఇందుకు రూ. 15 కోట్ల డీల్ జరిగినట్టుగా పోలీసులు తెలిపారు. ఇందకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెస్ రవీంద్ర బుధవారం మీడియాకు వెల్లడించారు. హత్యకు పన్నిన కుట్రను ఆదిలోనే భగ్నం చేశామని తెలిపారు. పలువురిని అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసిందన్నారు. ఈ కేసులో బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణల ప్రమేయం ఆరా తీస్తున్నట్టుగా వెల్లడించారు.
