కరీంనగర్:  పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నిదానపురం దేవయ్యపై మంగళవారం రాత్రి హత్యాయత్నం జరిగింది. రాత్రి దేవయ్య ఇంటివద్ద కాపుగాసిన నలుగురు గుర్తుతెలియని దుండగులు ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చిన సమయంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. 

అయితే దుండగుల కాల్పుల నుండి సురక్షితంగా తప్పించుకున్న దేవయ్య వారిపై ఎదురుతిరిగారు. ఈ పెనుగులాటలో దుండగుల వద్దనున్న గన్ కిందపడిపోయింది. దీంతో దుండగులు అక్కడినుండి పరారయ్యారు. 

read more   హ్యాండిచ్చిన ఓ ముఠా.. మరో టీమ్‌తో హత్య: హేమంత్ కేసులో వాస్తవాలు

ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో దేవయ్యకు భూవివాదం వుంది. అలాగే గతంలో గతంలో పీపుల్స్ వార్ పార్టీ మిలిటెంట్ గా పనిచేశాడు. కాబట్టి అతడి హత్యకు ప్రయత్నించింది మావోయిస్టులు లేదా భూవివాదం కలిగిన వ్యక్తులయి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కాల్పుల ఘటనపై దర్యాప్తు సాగిస్తున్నట్లు శ్రీరాంపూర్ పోలీసులు వెల్లడించారు.