మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గుర్తును పోలిన గుర్తులు.. హోకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్.. విచారణ రేపు..

మునుగోడు ఉప ఎన్నికల్లో గుర్తుల మీద హైకోర్టులో టీఆర్ఎస్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ముందు దీన్ని తిరస్కరించిన కోర్టు ఆ తరువాత రేపు విచారిస్తామని తెలిపింది. 

Munugodu byelection : TRS Lunch motion petition in Telangana High Court

హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నికల్లో గుర్తులపై హైకోర్టులో  లంచ్ మోషన్ పిటిషన్  అయింది. సోమవారం ఉదయం అధికార పార్టీ టిఆర్ఎస్ ఈ పిటిషన్ను దాఖలు చేసింది. కాగా, లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అత్యవసర విచారణ చేపట్టలేమని తేల్చిచెప్పింది. నవంబర్ 3న ఎన్నికలు ఉన్నందున ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోలేదని టిఆర్ఎస్ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ పిటిషన్ పై రేపు విచారిస్తామని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. 

కాగా, మునుగోడు ఉపఎన్నికలో ఎలాగైనా విజయం సాధించాలని  అధికార టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. హుజూరాబాద్ లో లాగా హడావుడి లేకుండా సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతోంది. నియోజకవర్గాన్ని యూనిట్లుగా విభజించి మంత్రులు, ఎమ్మెల్యేలను ఇన్చార్జిలుగా నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. అలాగే గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన బుల్డోజర్ తదిరత సింబల్స్ ఉండడం వల్ల ఓటర్లు అయోమయానికి గురయ్యారు. అయితే, ఈసారి అలాంటి నష్టం కలగకుండా టీఆర్ఎస్ ముందు జాగ్రత్తలు తీసుకుంది. 

తెలంగాణ క‌ల‌ను సాకారం చేసింది కాంగ్రెస్.. భారత్ జోడో యాత్రను గ్రాండ్ సక్సెస్ చేయాలంటూ షబ్బీర్ అలీ పిలుపు

దీనిలో భాగంగా కారు గుర్తును పోలిన ఎనిమిది గుర్తులు ఈ సారి ఎన్నికల్లో వున్నాయని.. వాటిని తొలగించాలని ఈ నెల 10 తెలంగాణ ఎన్నికల కమీషనర్‌కు టీఆర్ఎస్ లేఖ రాసింది. ఎన్నికల గుర్తు జాబితా నుంచి కెమెరా, చపాతి రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టు మిషన్, ఓడను తొలగించాలని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. అయితే ఈసీ నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీనిలో భాగంగా సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక రేపు దీనిమీద న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios